Monday, July 22, 2013

Itching and scaly scalp,మాడు దురదగా స్కేలిగా ఉండడము

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : హుమిడిటీ వాతావరణము వలన నా మాడు దురదగా , స్కేలిగా ఉండు జుట్టు నూనెగా చిక్కుల్లో కనబడుతుంది . ఏం చేయాలి ?

జ : తడి వాతావరనములో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది . వేసవి నుండి వర్షాలు విముక్తి ఇచ్చినా హ్యుమిడిటీ  మాడుకు , శిరోజాలకు సమస్యలు తెచ్చిపెడుతుంది. తలలో బాగా చెమటలు పోసి  క్రిములు -- ఫంగస్ , ఈష్ట్ , బాక్టీరియా ఏర్పడతాయి. దీనివల్ల చుండ్రు పెరిగి స్కేలీగా ఉండును. దురదకూడా ఉంటుంది.

తరచూ లేదా ప్రతిరోజూ  మైల్డ్ షాంపు తో తలస్నానము చేస్తుండాలి. మాడును పరిశుబ్రముగా ఉంచుకోవాలి. జుట్టుకు నూనె రాయవద్దు . దీనివల్ల ఫంగస్ ఇంఫెక్షన్‌ పెరుగుతుంది. ఒకవేళ నూనె రాస్తే అరగంటలో స్నానము చేయాలి.  వెంట్రుకలు హైరోస్కోపిక్ గుణాలు కలిగి నీటిని త్వరగా పీల్చేస్తాయి. దీనివలన చిక్కులు పడి మేనేజ్ చేయడము కష్టమవుతుంది. శిరోజాల స్వభావాన్ని అనుసరించి హెయిర్ క్లెన్సర్లు వాడాలి. తరచూ తలస్నానము వల్ల జిడ్డు మురికి పేరుకోవు .

కండిషనింగ్ చేసుకుంటుంటే చిక్కులు పడవు . స్టయలింగ్ ఉత్పత్తులు వాడడము తగ్గించాలి. తల వర్షము నీళ్ళలో తడవకుండా జాగ్రత్త వహించాలి. మూడు వారాలకొకసారి డీప్ కండిషనింగ్ ప్రోటీన్‌ చికిత్సవల్ల చిక్కులు పడడము తగ్గిపోతుంది .
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.