Tuesday, July 9, 2013

How to prevent rough eruption of daily beard saving,నిరంతర షేవింగ్ వల్ల వచ్చే షేవ్బంప్స్

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : నిరంతర షేవింగ్ వలన నాముఖము పై అసమాన ఎరప్షన్‌ వచ్చి చూడడానికి అసలు బాగుండడములేదు . వీటిని పోగొట్టే మార్గము సూచించంది ?

జ : షేవింగ్ వలన " స్యూడో ఫాలిక్యులిటీస్ బార్బె " లేదా షేవ్ బంప్స్ వస్తాయి. ఇవి షేవింగ్ ఇర్రిటేషన్‌ వలన కలిగే సమస్య . మందపాటి వెంట్రుకలుండడమువల్ల మగవారిలో సహజముగా ఈ సమస్య ఉంటుంది. ఇది సర్వసాదారణమే.

షేవ్ చేసిన వెంట్రుకలు తిరిగి పెరుగుతున్నప్పుడు  వెనక్కి పెరిగి కుదుళ్ళ నుండి తిన్నగా రావడానికి బదులు కర్లీగా వస్తాయి. సూడో ఫాలిక్యులిటీస్ వలన చర్మము ఎర్రగా కంది పోతుంది . దురద కూడా వస్తుంది. ఆ ప్రదేశము ఇన్పెక్షన్‌ అయి చిన్న చిన్న పొక్కుల్లాంటివి రావచ్చు. ప్రతి రోజూ షేవ్ చేసుకునేవారు 0.5 - 1 మి.మీ.దాకా వెంట్రుక పొడవు వదిలేయాలి. ఎలక్ట్రిక్ రేజర్ వాడడము ఒక మంచి ప్రత్యామ్నాయము .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.