Monday, July 29, 2013

Do we reduce weight by weekly hunger fast?,వారములో ఒకరోజూ ఉపవాసము చేయడము వలన బరువు తగ్గుతామా?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ : వారములో ఒకరోజూ ఉపవాసము చేయడము వలన బరువు తగ్గుతామా?

జ : బరువు తగ్గడానికి ఉపవాసమనేది ఏ విధముగానూ సహకరించదు . ఉపవాసము సరిగా(పూర్తిగా ఏమీ తినకుండా) చేస్తే శారీరక వ్యవస్థలో విషతుల్యాలు వెలికినెట్టడానికి కుదరదు . ఉపవాస దీక్షలో ఉన్నపుడు పండ్లు తినడము , జ్యూస్లు త్రాగడము , నీరు త్రాగడము చేస్తూ ఉంటారు ... కాబట్టి టాక్షిన్లు వెలికి వెళ్ళిపోతాయి.

ఉపవాసము బరువుపై తాత్కాలిక ప్రభావము మాత్రమే చూపుతుంది . అదీ వారముకో రో్జు ఉపవాసము చేసేవారికి బరువు తగ్గడానికి ఉపవాసము చేపట్టడము అన్నది సరైన పద్దతి కాదు . దీనివలన అత్యవసర పోషకాలు శరీరము కోల్పోతుంది. . . జీవక్రియ నెమ్మదిస్తుంది.

  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.