Monday, July 29, 2013

Do joint pains disturb sexual life?,శృంగార జీవితానికి కీళ్ల నొప్పులకు అవరోధమా?

  •  

  • image : courtesy with Surya telugu news paper July 15, 2013
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 Q : Do joint pains disturb sexual life?,శృంగార జీవితానికి కీళ్ల నొప్పులకు అవరోధమా?

A : నేడు ఆధునిక యుగంలో చాలా మంది నొప్పులతో వేధించ బడుతూ శృంగార జీవితానికి దూరమవుతున్నారు. కీళ్లనొప్పుల సమస్య వలన కదలికలు కష్టంగా మారుట వలన దాంపత్య జీవితంలో పూర్తి స్థాయి ఆనందాన్ని పొందలేక చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

లక్షణాలు

    కీళ్ల నొప్పులు తీవ్రస్థాయిలో ఉండటం వలన శృంగారంలో ఆకర్షన పరస్పరం తక్కువగా ఉండి తృప్తి ఆనందం తగ్గుతాయి.
    కీళ్ల వాపుతో ఉండటం వలన స్పర్శను ఇష్టపడక పోవడం.
    కీళ్లలో వాపుతో పాటు నొప్పి ఎక్కువగా ఉండి శృంగారంలో కదలికలు తక్కువగా ఉండటం.
    అంగస్తంబన సరిగా జరుగక పోవుట వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు.
    సమస్యను అధిగమించాలంటే....
    కీళ్ల నొప్పులు శృంగార జీవితానికి పెద్ద అడ్డంకి ఏమికాదు
    భాగస్వాములు ఇద్దరు సంయమనంతో నిమ్మదిగా శృంగారంలో పాల్గొనడం వలన తృప్తిని ఆనందాన్ని పొందవచ్చు.
    కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న కీళ్లపై భారం పడకుండ మెత్తటి కుషన్స్‌ అమర్చుకుని శృంగారంలో పాల్గొనడం వలన నొప్పి తీవ్రత తగ్గును.
    శృంగారంలో పాల్గొనేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయనే భావనను, భయ పడటాన్ని మానుకోవాలి. ఇలా భయపడటం వలన మానసికంగా కృంగిపొయి శృంగార ప్రేరణ తగ్గిపొతుంది. ఒక వేల భయం అనిపిస్తే భాగస్వాములిద్దరు సామరస్యంగా చర్చించుకోని భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.
    భాగస్వామిలో ఏర్పడే అసౌకర్యాన్ని గుర్తించి ప్రేమతో మొదులుకోవడం వలన దాంపత్య జీవితంలో విజయం సాధించవచ్చును.
 
 తీసుకోవలసిన జాగ్రత్తలు
    ఆహరపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహర పదార్ధాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు, వంటలలో నూనెను తగ్గించాలి.
    మాంసాహరం, ఆల్కహల్‌ స్మోకింగ్‌(అలవాటు ఉన్నవారు) వెంటనే మానివేసే ప్రయత్నం చేయాలి.
    ఆధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి వ్యాయమం యోగా నిత్యం చేయాలి.
    వ్యాయమం నడక, సైక్లింగ్‌ మొదలైనవి చేయడం వల్ల నొప్పులు కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా ప్రతి రోజు కొద్దిసేపు వ్యాయమం చేయడానికి ప్రయత్నించాలి.
    నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదు. నీరు సరిపడినంతగీ తాగాలి. తాజా కూరగాయలునిత్యం ఆహరంలో ఉండే విధంగా తీసుకోవాలి.

చికిత్స : స్వంత వైద్యము పనికిరాదు ... వికటిస్తే ప్రాణానికే ప్రమాధము . మీ ఫామిలీ డాక్టర్ ని సంప్రదించి సరియైన చికిత్స తీసుకోవాలి. కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్  ఉంటుంది.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.