Sunday, July 21, 2013

Beauty and Sleep, అందానికి నిద్రకి లంకె

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : అందానికి నిద్రకి లంకె(సంబంధము)ఉందంటారు . అది ఏమిటి?

జ : నిద్రకు , ఆరోగ్యానికి అవినాభావసంబంధము ఉంటుంది .. ఇది మనము ఎల్లప్పుడూ చెప్పుకునే సంగతే . ఇక్కడ నిద్రకు ... అందానికి చాలా దగ్గరి సంబంధము ఉన్నది. 7-8 గంటలు హాయిగా , సుఖముగా నిద్రపోయినప్పుడు అనేక అంతర్గత జీవక్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియలన్ని చురుగా పూర్తయితే ముఖము ప్రత్యేకముగా మెరిసిపోతుంటుంది. అదే నిద్రలేమి ముఖము పేలవం గా , నీరసం గా కనబడుతుంది. వయసు మీదపడిన భ్రాంతి కలిగిస్తుంది. కళ్ళకింద ఉబ్బులు వచ్చేసి , అలసటగా కనపడతారు .

నిద్ర చాలనపుడు బరువూ పెరిగిపోతారు . పనుల్లో చురుకుతనము మందగిస్తుంది. కాబట్టి కంటినిండా నిద్రపోతే అందం ఇనుమడించి , నిగారింపుగా కనపడతారు . అయితే అతిగా నిద్రపోయినా అందం ప్రబావితం కాక తప్పదని నిపుణులు చెప్తున్నారు . అతిగా నిద్రపోవడమువల్ల చర్మము సాగిపోతుంది. ఇది అనారోగ్యకర లక్షణము . ఆహారము కొంచమే తిన్నప్పటికీ 10 గంటలకు మించి నిద్రపోతే స్థూలకాయము వస్తుంది . అంటే నిద్ర విషయములోనూ ''అతి'' అనర్ధదాయకమే .
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.