Saturday, July 6, 2013

feeling guilty of her beauty, అందంగా లేనని బాధపడుతోంది.

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నాకు చిన్న వయసులోనే పెళ్లయింది. వెంటనే పాప కూడా పుట్టింది. నాకింకా నలభయ్యేళ్లు దాటలేదు. అప్పుడే అమ్మాయి పెళ్లీడుకొచ్చింది. నేను సన్నగా ఉంటా. మా అమ్మాయి కంటే రంగు ఎక్కువే! ఎప్పుడైనా తనూ, నేనూ బయటకు వెళితే 'మీరిద్దరూ అక్కాచెల్లెళ్లా' అని అడుగుతున్నారు. నేను అందంగా ఉన్నానని ఎవరైనా నాతో అంటే దానికి కోపం వస్తోంది. ఈ మధ్య తరచూ 'నాకు అక్క కాదు కావల్సింది, అమ్మ కావాలి! నువ్వు వయసుకు తగ్గట్టు వ్యవహరించడం లేదు' అంటూ చిరాకు పడుతోంది. నాతో బయటకు రావడం కూడా తగ్గించేసింది. తొందరలో పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నాం. 'నేనెవరికీ నచ్చనులే' అంటూ అసహనంగా మాట్లాడుతోంది. నన్నొక శత్రువులా చూస్తోంది. అందంగా కనిపించడం నా తప్పు కాదు కదా! ఏదైనా సలహా ఇవ్వండి.- ఓ సోదరి

A : మొదట మీ అమ్మాయి తన అందం గురించి తక్కువ అంచనా వేసుకోవడం, ఆత్మన్యూనతకు లోనవ్వడానికి సంబంధించి లోతుగా ఆలోచించండి. మీతో పోల్చుకుని మాత్రమే బాధపడుతోందా... ఇతరుల మాటలకు తను కుంగిపోతోందా అన్నదీ జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ తన అందం, రూపురేఖల గురించి మీరు కానీ, కుటుంబసభ్యులు కానీ ఆటపట్టిస్తూ ఏమయినా అనడం జరుగుతోందా? ఇంట్లో వాళ్లే తరచూ తన అందం గురించి విమర్శిస్తూ మాట్లాడుతుంటే అది ఆత్మన్యూనతకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితి ఉంటే వెంటనే మారేలా చూడండి.

మీరు అమ్మాయితో బయటకు వెళ్లేప్పుడూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరైనా తన ముందు మిమ్మల్ని పొగిడినప్పుడు ఆ ప్రశంసను స్వీకరిస్తూనే, సంభాషణను మార్చేయండి. మీ అమ్మాయికి సంబంధించిన ప్లస్‌ పాయింట్లను సందర్భోచితంగా ప్రస్తావించండి. 'మా అమ్మాయి మంచి రంగులూ, డిజైన్లూ ఎంపిక చేస్తుంది', 'మొన్న పండక్కి తనకి పంజాబీ డ్రెస్‌ కొందామనుకున్నా, తను చక్కటి జీన్స్‌, టాప్‌ కొనమంది. అలాగే చేశా. నిజంగానే అవి తనకు చాలా బాగున్నాయ్‌' అని చెప్పండి. అదేసమయంలో అందం, రూపురేఖల కన్నా చదువూ, వృత్తిపరంగా లభించే గుర్తింపు చాలా ముఖ్యమని నెమ్మదిగా అర్థం అయ్యేలా చెప్పండి. అలా పేరు తెచ్చుకున్న కొందర్ని ఉదాహరణగా చూపండి. ప్రవర్తనా పరంగా వచ్చే గుర్తింపు ఎప్పటికీ వెంటే ఉంటుందనే నిజాన్నీ, సౌందర్యం అనేది తాత్కాలికమనే విషయాన్నీ వివరించండి. అలానే ఇప్పుడు అందానికి మెరుగులద్దుకునే సౌందర్య సాధనాలెన్నో అందుబాటులో ఉన్నాయి. నిపుణుల సాయంతో మొటిమలూ, ఛాయ మెరుగుపడటం వంటి సమస్యల్ని అధిగమించేలా చూడండి. అమ్మాయి దూరమవుతోంది అన్న ఆలోచనను పక్కనపెట్టి, మీరు మంచి స్నేహితురాలని తను అనుకునేలా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ వైపు నుంచి చేసుకోవాల్సిన మార్పులేమైనా ఉన్నాయేమో ఆలోచించండి. అమ్మాయితో బయటకు వెళ్లినప్పుడు హుందాగా కనిపించేలా తయారవ్వండి. 'అమ్మ నాకు ఎప్పుడూ అండగా నిలబడుతుంది. అర్థం చేసుకొని నా కోసం ఆరాట పడుతుంది' అనే స్థాయికి తీసుకురండి.

source : Dr.Padmaja - Psychologist@dear vasundara
  •  =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.