Thursday, June 27, 2013

What are the cause for Hypertension?,రక్తపోటుకి కారణాలు తెలియజేయండి




  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ్ర : రక్తపోటుకి కారణాలు తెలియజేయండి ?

జ : నూటికి సుమారు 95మందిలో రక్తపోటు పెరగ టానికి కారణాలు ఇతమిత్థంగా తెలియవు. దీనిని ఎసెన్షియల్‌ (ప్రైమరీ) హైపర్‌టెన్షన్‌ అంటారు. 5 నుంచి 10 శాతం రోగుల్లో అధిక రక్తపోటుకు కొన్ని ప్రత్యేక వ్యాధులు కారణం కావచ్చు. వీటిని సెకండరీ హైపర్‌ టెన్షన్‌ అంటారు.

ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌ రావడానికి వంశానుగత కారణాలు ముఖ్యపాత్ర వహిస్తాయని వైద్య శాస్త్రవే త్తలు విశ్వసిస్తున్నారు. అధిక రక్తపోటు వంశపారం పర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటని చెప్పవచ్చు.

రక్తపు పోటు లేదా రక్తపోటు (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు. రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని 'అధిక రక్తపోటు'(high blood pressure or hypertension) అంటారు. ఇలా రక్తపు పోటు మితి మీరితే అది రోగ లక్షణం.

సాధారణ కారణాలు :
  •  వంశపారంపర్యము , 
  • రక్తనాళాల గోడలలో మార్పులు , 
  • మూత్రపిండాల హార్మోనులలో తేడాలు ,
  • మూత్రపిండాల వ్యాధులు , 
  • మదుమేహము నియంత్రణ లో లేకపోవడము , 
  • గర్భిణీ కాలములో కొన్ని హార్మొనుల తేడాలు వలన , 
  • గర్భము రాకుండా వాడే మందుల మూలాన , 
  •  వయసు పెరగడము తో పాటు రక్తపోటూ పరగడము , 
  • మధ్యపానము ఎక్కువగా ఉన్నప్పుడు , 
  • ధూమపానము మితిమీరితే రక్తనాళాలు గోడలలో మార్పులు మూలంగాను , 
  • ఆహారము లో పొటాషియం , కాల్సియం తక్కువగా ఎక్కువ కాలము తీసుకోవడం జరిగితే , 
  • నిద్రలేమి ఒక వ్యాధి గా మారితే , 
  • నిద్రలో శ్వాసపీల్చుకోవడము ఇబ్బంది ఉన్నపుడు నూ ,
  • నిరంతము ఒత్తిడిలో ఉన్నవారిలోనూ .............. బి.పి పెరిగే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి.
రక్తపోటును ఎక్కువ చేసే పరిస్తితులు --
  • శారీరకంగా , మానసికంగా .. ఎక్కువ శ్రమ పొందినపుడు ,
  • ఆవేశము పడినపుడు ,
  • మానసిక ఆందోళన చెందినపుడు ,
  • ఉరకనే కోపం తెచ్చుకోవడం ,
  • తరచూ నిర్లిప్తతకు లోనుకావడం , భయం , ఆత్రుత .
  • వయసు మళ్ళిన వారికి ,
  • రక్త నాళాల లోపలి పోర గట్టిపడి పోవడం " ఆర్టీరియో స్క్లీరోసిస్" వలన ,
  • మూత్రపిండాల వ్యాధులలోను ,
  • రక్తము లో వచ్చే కొన్ని మార్పులు ,
  • లావుగా ఉండడము ,
  • ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,
  • పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం ,


===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.