Monday, July 29, 2013

How to retain sexual potency in Diabetes?,డయబెటిస్‌లో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే ఎలా?


  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 Q : How to retain sexual potency in Diabetes?,డయబెటిస్‌లో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే ఎలా?

A : నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన అనుమానాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా భలహిన పరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచాటానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తరువాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుంచి విముక్తి పొందవచ్చు.

మధుమేహా వ్యాధి గ్రస్తులతో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే...
మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూర, మొలకెత్తిన విత్తనాలు, పాలు,గ్రుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి. కీర దోసకాయ,క్యారెట్‌, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్‌, జామ దానిమ్మ,ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట స్మోకింగ్‌ గుట్కాలు, పాన్‌పరాగ్‌, నార్కోటిక్స్‌ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం స్టెరాయిడ్‌ నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది. తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల ప్రభావం చూపి లైంగిక సామర్థ్యంను తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చును.

Treatment :
  • గుండె జబ్బులు లేనివారు .. వయగ్రా మందును వాడవచ్చును . వారానికి 2 లేదా 3 రోజులు ... Tab. penegra 25 mg or 50 mg per day 2-3 hours before the act.
  • సుగరు వ్యాది ఉన్నవారు ... వాటికి సంబంధిత మందులు క్రమము తప్పకుండా వాడాలి 
  • .రోజూ ఒక బి.కాంప్లెక్ష్ మాత్ర వాడితే చాలా మంచిది .

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.