Sunday, July 7, 2013

Drinking water in summer,వేసవికాలములో నీరు త్రాగడము

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : వేసవి కాలములో నీరు తాగడాన్ని ఏ విధముగా పెంచుకోవాలి ?

జ : నీరు త్రాగడానికి ఒక ఫార్ములా , పద్దతి అనుసరించాల్సిన అవసరములేదు . దాహము వేసినప్పుడల్లా త్రాగవచ్చును. రోజికు రెండు - మూడు లీటర్ల నీటిని లక్ష్యముగా పెట్టుకొని అప్పుడప్పుడు ఓ గ్లాసు చొప్పున్న దాహముతో నిమిత్తములేకుండా త్రాగుతూ ఉందాలి .

జ్యూస్ లు , పాలు , మజ్జిగ , కొబ్బరినీరు , రసము , సూప్ ...చివరకు కాఫీ , టీ, వంటి పానీయాలు కూదా ఈ నీటికోవలోకి వస్తాయి. దాహము వేసినప్పుడు నోరు , గొంతు , ఎండిపోయినట్లుంటాయి. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యము చేయకూడదు . ఇలా చేయడము వల్ల శరీరములొ నీటిస్థాయి తగ్గిపోయి మూత్రము సరిగా రాదు. వ్యాయామము చేసినపుడు , ఎండలోకి వెళ్ళినప్పుడు నీటి అవసరము మరింత ఎక్కువ కాబట్టి కావలసినంత నీరు త్రాగుతూ ఉండాలి . . . లేనట్లయితే డీహైడ్రేషన్‌ వస్తుంది. ఉదయము లేస్తూనే గ్లాసులకొద్దీ (లీటర్లకొద్దీ)నీరు తాగేయాలనుకోవడము సరికాదు. దీనివల్ల శరీరముపై ముఖ్యము మూత్రపిండాల పైన అనవర ఒత్తిడి పెరుగుతుంది . సోడియము , పొటాసియం వంటి ఇతర లవణాలు డైల్యూట్ అయిపోతాయి. రోజంతా కొద్దికొద్దిగా దాహము ఉన్నా లేకపోయినా నీరు త్రాగుతూ ఉండడము మంచి అలవాటు
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.