Tuesday, July 9, 2013

Precautions taken after swimming-pool bath,స్విమ్మింగ్ చేశాక శిరోజాల రక్షణకు జాగ్రత్తలు

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : స్విమ్మింగ్ చేశాక శిరోజాల రక్షణకు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?

జ : పూల్ లో డైవ్ చేయడానికి మించిన వ్యాయామము , వేసవిలో చల్లదనాని మరొకటిలేదు. పూల్ కలిపిన క్లోరీన్‌ హానికి బయపడి స్విమ్మింగ్ కు దూరముగా ఉండడము సబబుకాదు . శిరోజాలకు నష్టము జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

హెడ్ క్యాప్ పెట్టుకుని నీటిలోకి దిగాలి. జుట్టుకి ఆలివ్ లేదా కొబ్బరి నూనే కొద్దిగా రాసుకోవాలి . స్విమ్మింగ్ చేసిన తరువాత క్లోరీన్‌ ఆనవాళ్లును శుభ్రముగా కడిగేసి , కండిషనర్ అప్లైచేయాలి . " క్లారిఫైయింగ్ షాంపూ " క్లోరీన్‌ ను కడగడానికి మంచి ఎన్నిక . వారానికోసారి హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రఫ్ గా కాదు . . . దీనికి పెరుగు ,గుడ్డు  మిశ్రమము బాగా పనిచేస్తుంది. ప్రోటీన్లు , విటమిన్లు , ఖనిజలవణాలు ఉన్న ఆహారపదార్ధాలు అధికము గా తినాలి.
  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.