Thursday, August 8, 2013

Is the I-Q of baby increase with breast feeding?- తల్లిపాలతో బిడ్డ తెలివితేటలు పెరుగుతాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : తల్లిపాలతో బిడ్డ తెలివితేటలు పెరుగుతాయా?

జ : తల్లిపాలతో తెలివితేటలు---తల్లిపాలవల్ల మరో గణనీయమైన లాభం కనుగొన్నారు పరిశోధకులు. దీర్ఘకాలం తల్లిపాలు తాగి, పెరిగిన పిల్లల్లో మేధస్సు కూడా అధికంగా ఉంటుందట. ఎక్కువ కాలం తల్లిపాలు తాగిన పిల్లలు తమ మూడవ ఏట బాష, ఏడవయేట నాన్‌ వర్బల్‌ ఇంటలిజెన్స్‌లో మెరుగైన ప్రతిభ చూపిస్తారని అంటున్నారు. పుట్టిన మొదటి సంవత్సరం వరకూ తల్లిపాలతో పెరిగిన పిల్లలు తమ ఏడవ ఏట ఐక్యు పరీక్షలలో నాలుగురెట్లు అధిక ప్రతిభ చూపారు. కాబట్టి తల్లిపాలు పట్టడంవల్ల వచ్చే లాభాల చిట్టా పెరుగుతోంది. కాబోయే తల్లులు ఇది గమనించాలి.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.