Thursday, August 8, 2013

మూడురోజుల వరకు తల్లిపాలు పడవు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు శిశువు పుట్టిన మొదటి గంట లోనే తల్లిపాలు పట్టాలంటున్నారు. అదెలా సాధ్యం?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

Q :  మూడురోజుల వరకు తల్లిపాలు పడవు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు శిశువు పుట్టిన మొదటి గంట లోనే తల్లిపాలు పట్టాలంటున్నారు. అదెలా సాధ్యం?

A : కాన్పు అయిన ప్రతీస్త్రీ శిశువు పుట్టినప్పటి నుండే బిడ్డకు పాలుపట్టగలదు. ముందుగా వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి పాపాయి ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం. తల్లిపాలు ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీషులో 'టైలర్‌ మేడ్‌' అంటారు. ప్రకృతి శిశువులకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందించింది. మరో ఆలోచన అనవసరం. ప్రకృతి ఏర్పరచిన దారిలో నడవడం వివేకం. బాగా రక్తహీనతతోనూ , పౌష్టికాహారలోపముతోనూ , విటమిన్ల లోపముతోనూ బాదపడుతున్న తల్లులకు పాలు త్వరగా పడవు . అటువంటపుడు వీటిలోపాలను సరిచేసే మందు ... ఇంజక్షన్‌ రూపము లో ఇవ్వాలి . డెలివరీ అయిన తరువాత oxytocin ఇంజక్షన్‌ డాక్టర్ల సలహామేరకు తీసుకోవాలి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.