Thursday, August 8, 2013

Baby vomiting milk why?-కొందరు పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేస్తారెందువల్ల? .

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : కొందరు పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేస్తారు. ఎందువల్ల? ఎలాంటి మందులు వాడాలి?.

జ : అలా చేసే దానిని 'వాంతి' అనకూడదు. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కు వగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో 'పొసెట్టింగ్‌' అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.