Tuesday, August 27, 2013

what are the causes for infertility in women?,మహిళల్లో సంతానలేమికి కారణాలు ఏంటి?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

మహిళల్లో సంతానలేమికి కారణాలు ఏంటి?

A : ముఖ్యంగా మహిళల్లో సంతానలేమికి కారణం వారి వయస్సు. స్త్రీకి 32 ఏళ్లు దాటాక అండాశయం సామర్థ్యం ప్రతి ఏడాదికి తగ్గతూ పోతుంది. దానివల్ల కూడా సంతాన లేమి కలగవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

మహిళల్లో నెలసరి రావడం అన్నది వారి హర్మోన్ల వల్ల జరుగుతుంది. అలాగే రక్తస్రావం జరగడం అన్నది గర్భాశయపు లోపల పొర మందంపైన ఆధారపడి ఉంటుంది. నెలసరి సరిగా ఉండి, రక్తస్రావం సరిగా ఉన్నా... అండం సరిగా ఎదగపోవడం లేదా సరిగా విడుదలకాకపోవడం జరిగినా సంతానం కలగదని వారు చెబుతున్నారు.

అధిక బరువు కలిగిఉండటం కూడా పరోక్షంగా సంతాన లేమికి కారణం కావచ్చు. పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని, దాన్ని చక్కదిద్దితే వాళ్లకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది.

*వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వైద్య చికిత్స చేయించినా ఇటువంటి వారిలో సత్ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తక్కువ వయసుగల యువతుల్లో అండాశయం పలుచగా ఉంటుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.

* గైనకాలజీ పరిస్థితులు-- అండాశయం సరిగా పనిచేయలేకపోవడం, రుతుస్రావం బాగా తగ్గిపోవడం, సెర్వికల్‌ మ్యూకస్‌ లోపాలు, యుటిరిన్‌ ఫైబ్రాయిడ్స్‌, ఎండోమెట్రియోసిస్‌... మొదలైనవి.
* సంధాన సమస్యలు
* క్రమరహిత రుతుస్రావం
* పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌ (ప్రస్తుతం లేదా పూర్వం)
* టి.బి (క్షయ) వంటి ప్రస్తుత రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
90 శాతం స్త్రీలు ఏడాదిలోపుగానే గర్భం ధరిస్తారు. క్రమం తప్పకుండా శృంగార జీవితం గడిపే దంపతుల విషయంలో 95 శాతం స్త్రీలు రెండు సంవత్సరాలలోపు గర్భం ధరిస్తారు. ఈ కాల వ్యవధిలో సంతానం కోసం చికిత్స అవసరం లేదు. ప్రయత్నించినా సాధారణంగా వైద్య చికిత్సకు వైద్యులు ఇష్టపడరు. ఈ సమయం దాటితే స్పెషలిస్టుని సంప్రదించడం మంచిది.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.