Tuesday, August 27, 2013

What are the precautions to observe on computer work?,కంప్యూటర్ పై పనిచేసే వారు ఏ జాగ్రత్తలు పాటించాలి?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్రశ్న : కంప్యూటర్ పై పనిచేసే వారు ఏ జాగ్రత్తలు పాటించాలి?

జవాబు  : కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చుంటున్నారా...! ఐతే ఈ చిట్కాలు పాటిస్తే భవిష్యత్తులో మీకు తలెత్తబోయే ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1. మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సేపు పని చేస్తున్నట్లైతే, కంప్యూటర్ నుంచి
2. దాదాపు 30 -40 సెంటీమీటర్ల దూరంలో కూర్చోని పనిచేయండి.
3. ఒకవేళ కంప్యూటర్ యొక్క మానిటర్ బ్లింక్ అవుతుంటే దాంతో పని చేయడం మానివేయండి.
4. ప్రతి రెండు-మూడు గంటలకొకసారి కాసేపు నడవడం అలవాటు చేసుకోండి.
5. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి మీ దృష్టిని కాసేపు మరల్చండి, 15-20సార్లు కనురెప్పలను మూసి తెరవండి లేదా కాసేపు అలా కళ్ళను మూసి ఉంచండి. ఆ తర్వాత మీ తలను మీ సీటుకు ఆన్చి రిలాక్స్ అవ్వండి.
6. మీ మెడను మెల్లగా ఒత్తండి. అలాగే కుడి-ఎడమవైపుకు తిప్పండి.
7. క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయండి.
8. వీలైనంత ఎక్కువ సేపు నిద్రపొండి.

    తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, -
    పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, -
    కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -
    ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, -
    కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, -
    కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, -
    కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, -
    కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి, -
    ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, -
    ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.