Thursday, August 29, 2013

Tredmil selection before purchase,త్రెడ్ మిల్ కొనేసమయములో దేన్ని ఎంపిక చేసుకోవాలి?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : 'త్రెడ్ మిల్ ' కొనేసమయములో దేన్ని ఎంపిక చేసుకోవాలి?

జ : త్రెడ్ మిల్ కొంటున్నప్పుడు తలెత్తే తొలి సందేహము ... మాన్యువల్ కొనాలా? లేక మోటరైజ్డ్ కొనాలా? అన్నది . తెండింటికీ ప్రధాన తేడా మాన్యువల్ అయితే పాదాలతో పుష్ చేయాలి. త్రెడ్ మిల్ కు వ్యతిరేకము గా పాదాల కదలిల బెల్టును కదిలిస్తుంది. మోటరైజ్డ్ త్రెడ్ మిల్ అయితే ఎలక్ట్రానికల్ గా సెట్ చేసుకున్నప్పుడు త్రెడ్ మిల్ ను మోటారు కదిలిస్తుంది . మాన్యువల్ రకాల ధరలు అందుబాటులో ఉంటాయి. , చిన్నగా ఉండి తక్కువ స్థలము సరిపోతుంది. బెల్ట్ ను మనమే కదిలించాలి కాబట్టి ఎక్కువ క్యలరీలు ఖర్చు అవుతాయి. అయితే దీనివల్ల నస్టము లేకపోలేదు . మనమే కదల్చాలి కనుక త్వరగా అలసిపోతుంటాము . నెమ్మదిగా కదులుతారు. నెమ్మది వలన క్యాలరీలు రేటు గంటకు తక్కువే ఖరుచు అవుతాయి. పైగా జాయింట్స్ పై స్ట్రెయిన్‌ పెరుగుతుంది . త్రెడ్మిల్ పై రన్‌ చేయడము కూడా కష్టము . జాగింగ్ ప్రోగ్రాము లేదా రన్నర్ గా ట్రైనింగ్ కావాలనుకుంటే మాన్యువల్ రకము అవసరాలకు అనుగునముగా ఉండదు.
మోటరైజ్డ్ రకాలు ధరలు ఎక్కువ . అయితే ఎక్కువకాలము మన్నుతాయి. ఫిట్ నెస్ అవసరాలు తీర్చుతాయి. వివిధ స్పీడ్ లలో బెల్ట్ కదులుతుంది కాబట్టి మనకు కావలసిన విధము గా సర్దుబాటు చేసుకోవచ్చు . జాయింట్ల పై వత్తిడి ఉండదు .

చక్కని ఫిజికల్ షేప్ ఉంటే మినహా ... మాన్యువల్ త్రెడ్ మిల్ సిఫార్సు చేయతగింది కాదు. ఎక్కువ కేలరీలు ఖర్చు కావాలన్నా, వ్యాయామాలు సౌకర్యముగా ఉండాలన్నా మోటరైజ్డ్ రకాన్నే ఎందుకోవాలి.

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.