Tuesday, September 3, 2013

How do parents behave with their children?,తల్లిదండ్రులు వారిపిల్లలతో ఎలా మెలగాలి?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : తల్లిదండ్రులు వారిపిల్లలతో ఎలా మెలగాలి?

Ans : ప్రపంచంలో అతి జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యతల్లో చాలా ముఖ్యమైనది తల్లిదండ్రులుగా ఉండడమే. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు తరాలు రూపొందేది తల్లిదండ్రులు చేతుల్లోనే. అంతే కాదు ఏ వ్యక్తికైనా జీవితంలో అత్యంత మధురమైన అనుభవాలు ఉండేది కూడా బాల్యంలోనే. కాబట్టి తల్లిదండ్రులు కోపం ప్రదర్శించే తీరు, మాట్లాడే తీరు పిల్లల మీద దాదాపుగా శాశ్వతమైన ముద్ర వేస్తాయి. ముఖ్యంగా కోపాన్ని ప్రదర్శించే ముందు ఒక్కసారి పునరాలోచించుకోవడం చాలా అవసరం.
  • - చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తాము పిల్లలుగా ఉన్నపుడు ఎంత బాధ్యతగా ఉండేవారో పిల్లలకు ఉదహరిస్తూ చెప్తుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. చిన్నతనంలో మీలోపాలను గనుక మీ తల్లిదండ్రులు ఎత్తి చూపినపుడు మీరు పొందిన బాధ ఎలాంటిదో ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. కాబట్టి మీ సామర్థ్యం గురించి చెప్పడం కాకుండా వారు చెయ్యాల్సిన పనులు మరింత బాధ్యతాయుతంగా చేయడం ఎలాగో ఒకసారి వారికి వివరిస్తే సరిపోతుంది.
  • - తప్పు చేయనివారు ఈ లోకంలో ఎవరూ ఉండరు. తప్పుచేయడం చాలా సహజమైన విషయం. జీవన నైపుణ్యాలు నేర్చుకోవడంలో తప్పుచేయడం ఒక భాగం. మీ పిల్లలు మీకు నచ్చినట్టుగానే ప్రవర్తించాలని కోరుకోవడం మీరు చేసే అతి పెద్ద తప్పవుతుంది. కాబట్టి మీకు నచ్చని కోర్సు ఎంచుకున్నాడని అతడిని నిందించడం కుదరదు.
  • - ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను ఒకరితో ఒకరికి పోలిక చేర్చి మాట్లాడడం ఎప్పుడూ సరికాదు. ఇలా చేయడం వల్ల వాళ్లిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మీ పిల్లల మధ్య సయోధ్య చెడకుండా ఉండాలంటే ఇలాంటి పోలికలు ఎప్పుడు పెట్టకూడదు.
  • - తల్లిదండ్రులుగా వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటుంటాం. అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాం, ఇలా ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవడం వల్ల వారిలో బాధ్యతారాహిత్యం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిచోటా ప్రతిసారీ మనం ఉండి చూసుకోలేకపోవచ్చు, అలాంటి సమయాల్లో వారు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని సార్లు పిల్లలకు ఊపిరి సలపనివ్వని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొన్ని పనులు, కొన్ని నిర్ణయాలు వారికే వదిలేయాలి. ఇది వారిలో నిర్ణయించుకునే శక్తిని పెంపొదిస్తుంది. కాబట్టి పిల్లల విషయంలో అతిజాక్షిగత్త పనికి రాదు.
  • - పిల్లల దగ్గర మీరు మీ భాగస్వామిని గురించిన ఫిర్యాదుల గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడడం వల్ల మీ మీద, మీ భాగస్వామి మీద కూడా వారికి గౌరవం తగ్గిపోవచ్చు. అంతేకాదు ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవనుకున్నపుడు వారు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగడం మాత్రమే కాదు వారు చాలా సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు కూడా.
  • -తల్లిదండ్రులుకు ఇష్టం లేని పనిచెయ్యాల్సి వచ్చినపుడు పిల్లలు చాలా ఒత్తిడికి లోనవుతారు. అలాంటి సందర్భాలు ఎదురైనపుడు వారిని నిందించకుండా అలాంటి అవసరం ఏమి ఏర్పడిందో తెలుసుకోవడం చాలా అవసరం.
  • - ఆలోచించకుండా నీలాంటి పిల్లాడు ఇంకెవరికి ఉండడు. ఇలాంటి పిల్లాడు ఉండడం కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది వంటి మాటలు అసలు మాట్లాడకూడదు. ఇవి మీ పిల్లలను చాలా బాధిస్తాయి. అంతేకాదు జీవితంలో చెరిగిపోని ముద్రలుగా వారి మనసులో మిగిలిపోతాయి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.