Sunday, September 8, 2013

How to prevent bad smell of Leather shoe?,లెదర్ షూ దుర్వాసన రాకుండా సూచనలు ఇవ్వండి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : లెదర్ షూ దుర్వాసన రాకుండా సూచనలు ఇవ్వండి ?

జ : లెదరు జంతువు చర్మము కదా దానివాసన ఎక్కడికి పోతుంది...!
  • అదే షూ రెండు మూడు రోజూలు వరుసగా ధరించడము వలన వాసన వస్తుంది. దుర్వాసన వస్తుంటే లెదర్ కు ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి. వాసన తగ్గి మామూలు స్థాయికి వస్తుంది.
  • ప్రతి రోజూ షూ తీసేసిన తరువాత దాన్ని శుబ్రముగా క్లీన్‌ చేసి లోపలికి గాలి వెళ్ళేటట్లు ఉంచాలి. 
  • షూ వేసుకోవడానికి ఒక గంట ముందు పొడిగుడ్డతో తుడిచి మంచి పాలిష్ తో పాలిష్ చేయాలి. 
  • ప్రతిరోజూ వేసుకున్న షాక్స్ మార్చుతూ ఉండాలి .
  • ఎప్పుడూ షూ ను హెయిర్ డ్రయర్ లేదా మరేదైనా వస్తువుతో  డ్రై చేయవద్దు . దీనివల్ల లెదర్ ష్రింకవుతుంది ,పగుళ్ళు బారినట్లు అవుతుంది. 
  • సిడార్ ఉడ్ షూ టిస్సు పేపర్ వాడడము వలన తేమ పీల్చి చక్కని పరిమళాన్ని ఇస్తుంది. 
  • షూ పాలిష్ ను నాణ్యమైన దాన్ని వాడాలి .

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.