Saturday, September 21, 2013

Teenage is very sensitive & Zigjag how to maintain?, యుక్తవయసు చిక్కుముడి వంటి దశ ఎలా గడపాలి?


  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ఫ్ర : యుక్తవయసు చిక్కుముడి వంటి దశ  అంటారు కదా ... ఈ దశను ప్రశాంతముగా దాటే మార్గము లేదా?

జ : యుక్త వయసు Teenage (14 -21) పిల్లలలో భావోద్రేకాలు కలగా పులగం గా ఉంటాయి . తల్లిదండ్రుల చాటున అప్పటిదాకా ఉన్నవారు తమ స్వంత ఐడెంటిటీ  కోసము పాకులాడుతుంటారు. ప్రతీదీ తనకు తెలుసని భావిస్తారు. ఎన్నో మార్పులకు నిలయమయిన ఈదశ లో నియంత్రణలో ఉంచుకోగల కొన్ని అంశాలుంటాయి. ఈ వయసులో హార్మోనల్ మార్పులు ఎక్కువకాబట్టి ఆహారము విషయం లో జాగ్రత్తలు అవసరము . తక్కువ స్పైసీ గా , తక్కువ ఆయిలీ గా ఉండే పదార్ధాలు తినాలి. బర్గర్లకు బదులు శాండ్ విచ్ లు , భోజనాల నడుమ పండ్లు తీసుకోవాలి. ఏరియేటెడ్ పానీయాల షానే తాజా పండ్లరసాలు , సూప్స్ , మంచినీళ్ళు  , పల్చటి మజ్జిగ తాగుతూ ఉండాలి.

కొద్దికొద్దిగా ఎక్కువసార్లు ఆహారము తీసుకోవాలి. బాదంపప్పు , జీడిపప్పు , ఆప్రికోట్స్ వంటివి తినాలి . ఎందుకంటే పెద్దయ్యాక ఉండే ఎత్తులో 20 శారము , బరువులో 50 శాతము  ఈ వయసులోనే వస్తాయి . చాలినంత రెస్ట్ ఉండాలి. పునరుత్తేజము కోసం ఏధైనా రిక్రియేషన్‌ అవసరము . ప్రరి రోజూ ఏదో ఒక వ్యాయామము చేయాలి. ... సైక్లింగ్ , యోగా , స్విమ్మింగ్ , ఏరోబిక్ ఎక్షరసైజ్ లు చేస్తూఉండాలి. గార్డెనింగ్ , ఇంటిపనులు చేస్తూఉండాలి. .... ఇలా యుక్తవయసు పిల్లల్ని ఓ పద్దతి గా ఉంచగల్గితే ఈ దశ స్మూత్ గా సాగిపోతుంది .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.