Wednesday, August 28, 2013

Is it good for health if drinks 4 cups of Coffee or Tea?,రోజుకు నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగితే మంచిదా?


  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు
 తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : Is it good for health if drinks 4 cups of Coffee or Tea?,రోజుకు నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగితే మంచిదా?

A : మీరెన్ని కప్పులు కాఫీ తాగుతున్నారు.. టీ తాగకపోతే.. తలనొప్పి వచ్చేస్తుందా.. అయితే మంచిదే. రోజుకు నాలుగు కప్పుల కాఫీ, టీ తాగడం వల్ల కాలేయంలో ఏర్పడే అనవసర ఫాట్ కరిగిపోతుందని సింగపూర్ పరిశోధకులు కనుగొన్నారు.

కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోకూడదంటూ వైద్యులు సలహా ఇస్తున్న తరుణంలో సింగపూరుకు చెందిన టిక్యూ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనలో రోజుకు నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగితే కాలేయంలో కొవ్వు చేరకుండా బ్రేక్ వేయవచ్చునని కనుగొన్నారు.

ఇంకా మందుబాబులు కాని వారికి కాలేయంలో ఏర్పడే ఫాట్‌ను తగ్గించడంలో కాఫీ, తేయాకు కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో 70 శాతం మంది మధుమేహం, ఒబిసిటీకి కాలేయంలో కొవ్వు చేరటమే ప్రధాన కారణంగా ఉంది. అందుకే కాలేయంలో ఏర్పడే కొవ్వు కరిగేలా చేస్తే డయాబెటిస్, ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు అంటున్నా

*===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.