Saturday, October 5, 2013

Stress produce gastric ulcers?,కడుపులో అల్సర్లు ఒత్తిడివలన వస్తాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
 ప్ర : కడుపులో అల్సర్లు ఒత్తిడివలన వస్తాయా?

జ : ఇది కేవలం అపోహ మాత్రమే . మానసిక వత్తిడి అల్సర్ల కు దారితీస్తుందనడము లో నిజం లేదు. ఒత్తిడి అల్సర్ చికిత్సని  అడ్డుకుంటుంది. అల్సర్లకు కారణాల్ని గుర్తించని కాలము లో మానసిక వత్తిడే వీటికి కారణమని భావించేవారు.           
గత 20 సంవత్సరాల కాలములో ఉదరము లో ఉండే బ్యాక్టీరియా పట్ల అవేర్నెస్  పెరిగింది. ఉదరములో కుండే " హెలికోబ్యాక్టర్ పైలోరి" అనే బ్యాక్టీరియా అల్సర్లము కారణమని గుర్తించడము జరిగినది. కొన్ని రకాల మందులు ముఖ్యముగా ఆర్థ రైటిస్ కు వాడే NSAIDS మాత్రలు , స్పైసీ ఫుడ్స్ , కారము ,మసాలా ఆహారపదార్ధములు గాస్ట్రైటిస్ ని కలుగజేసి ... ఉల్సర్ల యేర్పడడానికి దోహదము చేస్తాయి.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.