Thursday, October 24, 2013

Impotent,ఇంపోటెంట్,అసమర్ధుడు

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నాకు 28 ఏళ్లు. మూడు నెలల క్రితం పెళ్లయింది. మొదట్లో శృంగారంలో కొద్దిగా వెనుకంజ వేసినప్పటికీ ఇప్పుడు బాగానే ఉంటున్నాను. కానీ ఇప్పుడు నా భార్య నేను ఇంపోటెంట్ అనీ, అందుకే నేనంటే తనకు ఇష్టం లేదనీ, కుటుంబసభ్యులతో చెప్పి నానా అల్లరీ చేస్తోంది. నేను పోటెంట్ అని నిరూపించే పరీక్షలు చేయించి చూపమని ఆమె తరపువాళ్లు అడుగుతున్నారు. నాకు ఎటూ తోచడం లేదు. ఈ విషయంలో మీ సలహా ఏమిటి?


A : ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఆత్మన్యూనతా భావానికి గురవడం సహజం. కానీ మీరు భయపడాల్సిన పనిలేదు. మీరు నార్మల్‌గానే ఉన్నారని చెప్పడానికి దశలవారీగా అనేక పరీక్షలున్నాయి. పరీక్షల్లో భాగంగా ముందుగా బాహ్యజననాంగాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూస్తారు. ఆ తరువాత మెదడు, జననాంగాల నుంచి విడుదలయ్యే హార్మోన్ల ఉత్పత్తి నార్మల్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి టెస్టులుంటాయి. ప్రతి పురుషుడికీ నిద్రలో అతనికి తెలియకుండానే ఎరెక్షన్స్ వస్తుంటాయి. అవి రికార్డ్ చేయడానికి రిజీస్కాన్ పరీక్ష అవసరం అవుతుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి జననాంగంలోకి ప్రోస్టాగ్లాండిన్ ఇంజెక్షన్ ఇచ్చి ఎంత ఎరెక్షన్ వస్తుందో తెలుసుకోవాలి. వీటిని బట్టి పొటెన్సీ నిర్ధారణ చేయవచ్చు. మీరు మంచి ఆండ్రాలజిస్టును కలవండి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.