Thursday, October 10, 2013

Hints to prevent Stroke?, స్ట్రోక్ రిష్క్ రాకుండా జాగ్రత్తలు ఏమి పాటించాలి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : స్ట్రోక్ రిష్క్ రాకుండా జాగ్రత్తలు ఏమి పాటించాలి ? ఇక్కడ స్తోక్ అంటే గుండకు సంబంధించి.

జ :హార్ట్‌ఎటాక్‌కు, స్ట్రోక్‌కు మధ్య గల సున్నితమైన తేడాను తెలుసుకోవటం అవసరం. హార్ట్‌ ఎటాక్‌ను గుండె పోటు అంటాం. గుండెపోటును కూడా ఒక్కొక్కసారి హార్ట్‌ స్ట్రోక్‌ అంటూ వుంటాం. సాధారణ పరిభాషలో రెండు పదాలకు పెద్దగా తేడాలేక పర్యాయ పదాలుగా ఉపయోగించబడుతున్నా, వైద్యపరిభాషలో రెండూ ఒకటికాదు. వైద్య పరిభాషలో స్ట్రోక్‌ అనేదానికి మెదడులో రక్తప్రసరణకు హార్ట్‌ ఎటాక్‌ అనేదానిని గుండెకు రక్తప్రసరణకు ఉపయోగిస్తుంటారు. రెండూ రక్తనాళాలకు సంబంధించినవే అయినా గుండె, మెదడు విష యంలో ఈ తేడా గమనార్హం.
కదల కుండా ఎంచక్కా టెలివిజన్‌ ముందో , కంప్యూటర్ ముందో సెటిలయితే బాగానే ఉండొచ్చు కాని శారీరక చురుకుదనము లేక గుండెకు హాని జరుగుతుంది. శారీరక వ్యాయామము చేసేవారు ఆరోగ్యము గా , మంచి ఫిట్ నెస్ తో ఉండడమే కాదు వారి గుండె గట్టితనము బేషుగ్గా ఉంటుంది.
వారానికి నాలుగు సార్లు ఓ మాదిరి వ్యాయామము చేసేవారిలో  స్ట్రొక్ అవకాశాలు మిగతావారికంటే చలా తక్కువగా ఉంటాయి . ఇలా వ్యాయామము చేసే వారితో పోల్చితే చెయ్యని వారిలో 20 శాతము స్ట్రోక్ అవకాశాలు ఎక్కువ . ఏమిటి లింక్ అని ప్రశ్నించుకుంటే  ఎక్షరసైజ్ లు రక్టనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి , రక్త సరఫరా లో బ్లాకేజీలను పూర్తిగా తగ్గిస్తాయి. స్ట్రోక్ కు  కారణమయ్యే చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ను కరిగిస్తాయి.ఏ రకము వ్యాయామము చేసినా ఒబెసిటీ , డయాబిటీస్ , రక్తపోటు తగ్గడమే కాదు - స్ట్రోక్ ముప్పూ ఉండదు. మరి ఏ ఇతర మినహాయింపులూ ఇచ్చుకోకుండా రోజుకో అరగంట అయినా వ్యాయామము చేస్తే మనస్సూ , శరీరము ఉల్లాసము గా ఉంటాయి.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.