ప్ర : శాకాహారము తింటే బరువు ఎక్కువ అవదా? ఒక్క శాకారమే తింటున్నవారు బరువు తగ్గుతారా?
జ : చాలామంది బరువు తగ్గడం వెనుక రహస్యము శాకాహారమని భావిస్తుంటారు. బరువు తగ్గడానికి , బరువెక్కకుండా ఉండడానికి కారణము శాకాహారము కాదు . . . సరిగా ఆహారము ఎంచుకోవడము , మితముగా ఉండడము . శాకాహారములోనూ అత్యంత ఎక్కువ కేలరీలు , అనారోగ్యకరమైనవి ఉన్నాయి. ముఖ్యమైనది ఏమిటంటే .... తాజాగా ఉన్నపండ్లు , ఉడికించిన కూరగాయలు , కొవ్వు ఎక్కువలేని ఆహారపదార్ధాలు ఆహారములో భాగముగా చేసుకోవడము . ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారము తీసుకోవడము , నీరు ఎక్కువగా త్రాగడము , తక్కువ కేలరీల ఆహారము వేలకు భోజనము చేయడము మంచిది. బరువు పెరగరు .. తగ్గుతారు కుడా.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.