Tuesday, October 15, 2013

Do microwave oven cooking good for health?, మైక్రోవేవ్ ఒవెన్‌ లో వండే పదార్ధాలు ఆరోగ్యానికి మంచిదేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : మైక్రోవేవ్ ఒవెన్‌ లో వండే పదార్ధాలు ఆరోగ్యానికి మంచిదేనా?

జ : ఈ సందేహము చాలామందిలొ అంతర్లీనముగా ఉంటుంది. పదార్ధాలను వేదిచేసుకోవడానికైనా , పాప్ కార్నస్ తయారీ ,పూర్తి బోజనము తయారీలో మక్రోవేవ్ ఒవెన్లు వరం లాంటివి. ముఖ్యముగా సమయం తక్కువగా ఉండే ఉధోగినులకు మరింత ఉపయోగముగా ఉంటాయి. చాలామంది ఆహారనిపుణులు సైతము మైక్రొవేవ్ కుకింగ్ కు మొగ్గుచూపుతారు. పదార్ధాలను తయారీకి చాలా తక్కువ నూనె పట్టడమే ఇందుకు కారణము .
అయితే మైక్రోవేవ్ ఓవెన్‌ లో వంట చేయడము వల్ల కొన్ని పోషలాలు కోర్పోతామన్నది చాలామంది అభిప్రాయం ... ఇది నిజము కాదు .మైక్రొవేవ్ ఓవెన్‌ లో పదార్ధాలు ఉండికించినా , తిరిగి వేడిచేసినా కొన్ని పోషకాలు నశిస్తాయి. ఐతే  సంప్రదాయ పద్దతుల్లో వంట చేయడము , వేపుళ్ళ విషయం లోనూ ఈ పోషకాలు కొల్పోవడము అన్నది జరుగుతుంది. బయట స్టీమింగ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రము ... దీంతో పోల్చితే మైక్రోవేవ్ ఓవెన్‌ ఎక్కువ పోషకాలు కోల్పోవాల్సి వస్తుంది.

మైక్రోవేవ్  పదార్ధాలలోని తేమను పూర్తిగా గ్రహించి డ్రై చేస్తాయి కాబట్టి స్టీమింగ్ తో పోల్చినప్పుడు పోషకాల నష్టము ఎక్కువే . మైక్రోవేవ్స్ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్లు లీక్ చేస్తాయన్నది మరో అభప్రాయము అయితే ఒవెన్‌ సరిగా మెయిన్‌టెయిన్‌ చేసినప్పుడు దీనిగురించి ఆందోళన చెందనవసరములేదు. మైక్రోవేవ్ డోర్స్  లేదా సీల్స్ డ్యామేజీ కాకుండా ఒవెన్‌ సక్రమముగా పనిచేయాలి. వేవ్స లోపలే ఉండిపోవాలి. వాడనప్పుడు మైక్రొవేవ్ ను షటింగ్  ఆఫ్ చేయడము మంచి అలవాటు . ఎందుకంటే అప్లియన్స్ స్విచ్చాఫ్ లొ ఉన్నప్పుడు రేడియేషన్‌ ఉండదు.
స్టీమింగ్ కు ప్రాధన్యం ఇస్తూ ప్రెజర్ కుక్కర్ వాడడం మంచిది . మైక్రొవేవ్ ను సైకర్యాన్ని బట్టి అప్పుడప్పుడు వాడుకోవాలి. దీనిలో ఎప్పుడూ కూడా మైక్రోవేవ్ గ్లాస్ మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ పాత్రలయితే ఆహారపదార్ధాల్లోకి ప్లాస్టిక్ లీకయ్యే ప్రమాధము ఉంటుంది.
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.