Saturday, October 26, 2013

Lampblack or collyrium effets the eyes?,కాటుక పెట్టుకోవడము వలన కళ్ళకు హాని జరుగుతుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *


Q : కళ్ళకు ఎలాంటి కాటుక పెట్టుకోవాలి? కాటుక పెట్టుకోవడము వలన కళ్ళకు హాని జరుగుతుందా?

A : కాటుక అంటే ఆముదము మొదలైన దీపపు మసిని అదే నూనెతో రంగరించి పచ్చకర్పూరము లాంటి సుఘంధ ద్రవ్యాలను చేర్చి తయారు చేసిన కంటి క్రింది భాగంలో అలంకరణకు,ఆరోగ్యానికి ఉపకరించే సౌందర్య సాధనము.
కనులకు అందాన్ని, హాయిని ఇస్తుంది కాటుక. ఎంత చిన్న కనులైనప్పటికీ వాటికి కాటుక సింగారించినపుడు అవి అందంగా, పెద్దగా కనిపిస్తాయి. కాటుక వలన కళ్ళకు చలవే చేయడమే కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుం టాయి. కాటుకవల్ల కళ్ళు మరింత అందంగా ఉంటాయికదాని కాటుక సుద్దలు సుద్దలుగా లావు గా పెట్టుకుంటే ఉన్న అందం కూడా పోతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కాటుకలు దొరుకు తున్నాయి. అయితే వాటిల్లో ఏది మంచి కంపెనీయో, ఏది కాదో తెలీక సందేహంలో పడతాం. కనుక ముందుగా వాటి వివరాలు తెలుసుకుని ఆనక వాడటం మంచిది. లేకుంటే వాటి వలన కంటికి హాని కలుగవచ్చు. కొన్ని కాటుకలు వాడటం వలన కళ్ళకు మంటలు, దురదలు వస్తుంటాయి. అవి ఫలానా కాటుక ఉపయోగించినందు వలన వచ్చాయని గమనించినట్లయితే వేంటనే ఆ కాటుకను వాడటం మానేయాలి. కొన్నిరకాల కాటుకలను ఉపయోగించినందువల్ల క్రమంగా చూపు మందగించే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా వుండాలంటే మనం ఇంట్లోనే కాటుక తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న కాటుక పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ఉపయోగకరంగా వుంటుంది. డబ్బు కూడా ఆదా చేసినట్లవుతుంది.

ఇంతకీ కాటుక ఎలా తయారుచేయాలంటే...

శుభ్రమయిన ప్రమిదలో మంచి ఆముదం పోసి, దానిలో దూదితో చేసిన వత్తిని ముంచి వెలిగించాలి. ఒక రాగి పాత్రను వెలుగుతున్న వత్తికి సుమారు రెండు మూడు అంగుళాల పైన ఉండేట్లు బోర్లించాలి. రాగి పాత్ర లోపలి భాగంలో అంటే మసి అంటుకునే వైపు మంచి గంధం పూత పూయలి. మధ్య మధ్యలో ఆముదాన్ని పోస్తూ బాగా మసి పట్టేలా చేసి, తర్వాత ఆ మసినంతటినీ జాగ్రత్తగా గీకి ఆముదంతో తడిచేసి, ఇందులో కొంచెం కర్పూరాన్ని కలిపి శుభ్రమయిన భరిణెలో నిలువ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న కాటుక కళ్ళకు మంచిది. కళ్ళను చల్లగా ఆరోగ్యవంతంగా వుంచుతుంది. కాటుక పెట్టుకున్న కళ్ళు కలువల్లా భాసిస్తాయనటంతో అతియోక్తి లేదు. కనుబొమలకు మంచి ఆకృతినిచ్చి, అందంగా ట్రిమ్‌ చేసినట్లయితే కాటుక కళ్ళు మరింత అందాలు చిందిస్తాయి.. గర్భవతులు క్రమం తప్పకుండ కాటుక పెట్టుకుంటే బిడ్డకి, తల్లికి మంచిది.

  • =========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.