Thursday, October 24, 2013

Hernia , హెర్నియా,గిలక

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


 Q : మా అబ్బాయి వయసు 17 సం. లు పుట్టినప్పటి నుంచి బాగానే ఉన్నాడు. 3 నెలల క్రితం వృషణాలలో మార్పు వచ్చింది. ఎడమ వైపు వృషణం ఒక్కసారిగా లావుగా వాస్తుందట. కానీ నొప్పి ఉండదు. ఒక్కోసారి మామూలుగానే ఉంటుంది. దానివల్ల అతనికి ఎరెక్షన్స్ మటుమాయమైనాయని అంటాడు. ఈ సమస్యతో బాబు చదువులో కూడా వెనకపడ్డాడు. చాలా డిప్రెషన్‌కి గురవుతున్నాడు. ఇలా జరగడానికి సుఖవ్యాధులు కారణమా? దీని ప్రభావం ముందు ముందు ఏమైనా ఉంటుందా? ఆపరేషన్ అవసరమా? ఏ వయసులో చేయించాలి? ఆ తర్వాత ఎరెక్షన్స్ మెరుగుపడతాయా?

A : మీరు భయపడుతున్నట్లుగా మీ అబ్బాయికి సుఖవ్యాధులుండే అవకాశం లేదు. చిన్న ఆపరేషన్‌తో సమస్య పరిష్కారం అవుతుంది. మీరు రాసిన లక్షణాలను బట్టి అతనికి ఎడమ వైపు ఇంగ్వయినల్ హెర్నియా ఉందనిపిస్తోంది. గజ్జలలో ఉండే ఇంగ్వయినల్ నాళం పొట్టలో ఉండే పేగులు కిందకు జారతాయి. అలా జారుతూ వృషణం పక్కన చేరి వృషణం పెద్దదయిందనే భ్రమ కలిగిస్తాయి. కానీ హెర్నియాకు, వృషణానికి సంబంధం లేదు.

అది తెలియక మానసిక ఆందోళనకు గురయ్యి ఎరెక్షన్స్ తగ్గి ఉండవచ్చు. హెర్నియా ఆపరేషన్ ఏ వయస్సులోనైనా చేయవచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మీ అబ్బాయి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ఆధునిక ఆపరేషన్ తరువాత రెండు రోజులలో డిశ్చార్జ్ కావచ్చు.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.