Saturday, October 26, 2013

Day-time sleep , after-noon sleep,పగటి నిద్ర , మధ్యాహ్నం నిద్ర

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : మధ్యాహ్నం భోజనం అయిన తరువాత నిద్రపోవడము ఆరోగ్యానికి మంచిదేనా?.

జ : లాభాలు : వీలుపడితే మద్యాహ్నము ఒక గంటకు మించకుండా నిద్రపోతే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, శరీరానికి చురుకుతనము కలుగుతుంది. రక్తపోటు తగ్గించడములోనూ సహకరిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము తగ్గుతాయి . రోజంతా హాయిగా ,ప్రశాంతముగా ఉంటుంది. పగటిపూట నిద్ర ఆరోగ్యానికి భంగం చేస్తుందని, అందుచేత పగలు నిద్రపోరాదని పండితులు చెబుతున్నారు. రాత్రినిద్రబట్టనివారు, అనారోగ్యంతో బాధపడేవారు పగలు నిద్రపోవచ్చు. వేసవి కాలంలో పగలు నిద్రపోవచ్చు.

నష్టాలు : పగటి పూట నిద్ర పోవడము మన దైనందిన పనులకు ఆటంకము కలుగుతుంది.తగిన వ్యాయామము లేకపోతే బరువు పెరిగే అవకాశము ఉంటుంది. పగలు ఎక్కువగా నిద్రపొతే ,రాత్రులు నిద్రపట్టకపోవచ్చు ... స్లీప్ క్లాక్ డిస్టర్బ్ అయి , నిద్ర సమస్యలు తలెత్తవచును. కావున అవసరమున్నంతవరకే పగటి నిద్రను ఉపయోగించుకోవాలి. భారీ కాయమున్నవాళ్ళు పగటినిద్ర పోకూడదు. పగలు నిద్ర పోయే అలవాటుందా? అయితే అది రెండో రకం మధుమేహానికి నాంది అని అంటున్నారు పరిశోధకులు. చైనాలో 20 వేల మందిపై జరిపిన అధ్యయనం ఈ విషయానే్న చెబుతోంది. వాళ్లంతా కూడా 50 ఏళ్ల పైబడిన వారే. వారంలో కనీసం నాలుగైదు రోజులు పగలు నిద్రపోయేవారిలో నూటికి 36 శాతం మందిలో ఈ మధుమేహ లక్షణాలు కనిపించాయట. మన శరీరంలోని వివిధ రకాల హార్మోన్ల నైసర్గిక సమ తౌల్యతపైన ఈ పగటి నిద్ర ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర శాతం పెరుగుదలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాక చిన్న చిన్న జబ్బులతో బాధపడే వారు తరచూ పగటి నిద్రకు అలవాటు పడడాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. శారీరక శ్రమ కలిగించే పనుల్లో నిమగ్నం కావడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు మానుకోవడం ఈ పగటి నిద్రపోయే వారు మంచిదని వారు హెచ్చరిస్తున్నారు.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.