Thursday, October 24, 2013

Hydrocoel , వరిబీజం లేక హైడ్రోసీల్

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : నావయస్సు 69 సం.లు గత పది సంవత్సరాలుగా నా వృషణాల సంచి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం ఒక రబ్బరు బెలూన్‌లా తయారైంది. దీని చుట్టుకొలత 18 ఇంచులు ఉంది. మూత్ర విసర్జనలో ఎలాంటి బాధ, నొప్పిలేవు. నేను శృంగారంలో పాల్గొనేటప్పుడు అది అవరోధంగా అనిపిస్తుంది. తర్వాత కొన్ని గంటల వరకు స్క్రోటం నొప్పిగా ఉంటుంది. అందువల్ల అంగం పొట్టిగా అయ్యింది. ఇరెక్షన్స్ గట్టిగా ఉండటం లేదు. శృంగారంలో పాల్గొనేటప్పుడు అది పగులుతుందేమోనని భయంగా ఉంది. ఇక్కడి డాక్టరుకు చూపిస్తే అంక్ష వాయువు లేదా బుడ్డ కావచ్చని చెప్పారు. దీనికి సర్జరీ అవసరమని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. ఒక వేళ ఆపరేషన్ చేయించుకోక పోతే వచ్చే నష్టాలేంటి?

A : మీలో ఉన్న సమస్యను వరిబీజం లేక హైడ్రోసీల్ అంటారు. వృషణం చుట్టూ ఉండే ట్యునికా వ్జైలిస్ అనే పొరల మధ్య నీరు చేరడాన్నే హైడ్రోసీల్ అంటారు. దీనికి నిర్దుష్టమైన కారణాలేమీ ఉండవు. కొద్దిమందిలో వృషణానికి దెబ్బ తగిలినా, చీము పట్టినా, లేక వృషణం క్యాన్సర్ కణితి కణజాలం ఈ పొరల మధ్య ఉండవచ్చు. కాబట్టి వృషణము సైజు, సంచి పరిమాణం పెరిగితే .... తప్ప కుండా మంచి సర్జెన్‌ కి  చూపించాలి.
ఆ భాగాన్ని స్కానింగ్‌చేయడం వలన లోపల ఉన్న జబ్బు తెలుస్తుంది. కేవలం నీరు ఉంటే దానికి లార్డ్స్ ప్లిలైకేషన్ కానీ ‘జాబొలే ఎవర్షన్’ అనే ఆపరేషన్ గానీ చేయాలి. సర్జరీ చేయకపోతే నొప్పితో పాటు ఇన్‌ఫెక్షనలకు దారితీయవచ్చు. అది పగిలిపోవడం గానీ కాల్షియం పేరుకుపోవడం, వృషణం చిన్నదవటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  •  *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.