ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : పాలు -ప్రత్యామ్నాయాలు తెలియజేయండి?,Milk sustitutes.
జ : ప్రపంచ వ్యాప్తం గా బిడ్దకు ఇచ్చే తొలి ఆహారము పాలు . పిల్లల పెరుగు దలకు పాలు చాలా అవసరము . పాలు తాగడము ఇష్టపడ్ని పిల్లలకు ప్రత్యామ్నాయ ఆహారపదార్ధాలు ఇవ్వాలి . వారికి పెరుగు , చీజ్ , పన్నిర్ , మజ్జిగ వంటి పాలు ఆధారిత పద్దర్ధాలతో పాటు గుడ్లు , చేపలు , చికెన్ , జింజ ధాన్యాలు , సోయాబీన్లు , బఠాణీలు వంటివి అధికం గా ఇవ్వాలి.
పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.
పోషక విలువలు కొవ్వు పదార్దాలు 4 %,
పిండి పదార్ధాలు ('కార్బోహైడ్రేట్'లు) - 4.7 %,
మాంసకృత్తులు ('ప్రోటీన్'లు) - 3.3 %,
నీరు - 88 %,
మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.
*===========================
visit my website - >
Dr.Seshagirirao-MBBS -