Sunday, November 30, 2014

What is Cyber knife VSI ?, సైబర్ నైఫ్ VSI అంటే ఏమిటి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : సైబర్ నైఫ్ VSI అంటే ఏమిటి?

 జ : ఇది సైబర్ యుగం. అన్నీ రంగాల్లోనూ సైబర్ విప్లవ ఫలితాలు అందుతున్నాయి. క్యాన్సర్ చికిత్స రంగమూ దీనికి మినహాయింపు కాదు. సైబర్ నైఫ్... పేరుకు ఇదేదో కంప్యూటర్ కత్తిలా అనిపిస్తున్నా... నిజానికి కత్తి కాని కత్తి ఇది. క్యాన్సర్ ఉన్న మేరకు మెత్తగా కోసే కత్తి ఇది. కాకపోతే ఆ కోతకు గాటు ఉండదు. నొప్పి ఉండదు. బాధ ఉండదు. క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధి. ఒకసారి వచ్చిందంటే చికిత్సకు లొంగదనే అపోహ. కానీ అదిప్పుడు వాస్తవం కాదు. శరీరంలోని ఏ భాగంలో క్యాన్సర్ ఉన్నా... అత్యంత సంక్లిష్టమైన చోట్లలో క్యాన్సర్ కణితి ఉన్నా ఇప్పుడున్న అత్యాధునిక సునిశితమైన పరికరాలతో సులువుగా తొలగించడం ఇప్పుడు సాధ్యమే.

సైబర్ నైఫ్ VSI అనేది శరీరం మొత్తానికి ఉపయోగపడే రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టం. శరీరంలో క్యాన్సర్ మరియు క్యాన్సర్ కాని కణుతులు, మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమ గ్రంధి మొదలైన ఏ భాగంలో ఉన్నా సునిశిత, సంపూర్ణ, విశిష్ట రేడియేషన్ శస్త్ర చికిత్స సదుపాయాన్నిచ్చే ఏకైక పరికరం సైబర్ నైఫ్ VSI. సునిశిత వైద్య పరిజ్ఞాన్నాన్ని, అత్యంత సమర్ధవంతమైన కంప్యూటర్ టెక్నాలజీని, అత్యత్తమ ఇమేజ్ గైడింగ్ టెక్నాలజీని సమ్మిళితం చేసి, శరీరంలో ఏ అవయవంలోనైనా ఉన్న క్యాన్సర్ కణితులను యుద్దాలలో వారే క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీలాగా, సూదిమొనంత ఖచ్చిత్వంతో, అధిక మోతాదులో రేడియేషన్ వెలువరిస్తూ ప్రక్క భాగాలపై ఎటువంటి దుష్ప్రభావం లేకుండా చేసే అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నైఫ్ VSI.


సైబర్ నైఫ్ VSI ప్రయోజనాలు


చికిత్సా కాలం 4-5 వారల నుంచి 5 రోజులకంటే తక్కువకు కుదింపు
సబ్ మిల్లీమీటర్ కచ్చితత్వంతో చికిత్స అందిస్తుంది
ఏక్స్ ట్రాక్రానియల్ మరియు ఇంట్రాక్రానియల్ కణితులకు చికిత్స
ఆరోగ్యవంతమైన కణజాలానికి, క్లిష్టమైన భాగాలకు రేడియేషన్ తగ్గించి కణుతులను నాశనం చేస్తుంది.
అతి తక్కువ దుష్ప్రభావాలతో అధిక క్యాన్సర్ నిర్మూలన రేడియేషన్ అందిస్తుంది
సౌకర్యవంతమైన, కోతలేని ప్రత్యామ్నాయ శస్త్ర చికిత్స కల్పిస్తుంది
ట్రామినల్ న్యూరాల్జియా, వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ వంటి రోగులకు ఖచ్చితమైన చికిత్స అందించబడుతుంది.

ఇతర వ్యాధుల్లోనూ ఉపయోగం
 సైబర్‌నైఫ్ సేవలను కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే కాకుండా... క్యాన్సర్ కాని ఇతర వ్యాధుల్లోనూ ఉపయోగించుకోడానికి వీలవుతుంది. వాటిలో కొన్ని...  మెనింజియోమాస్  పిట్యూటరీ  అకౌస్టిక్ న్యూరోమాస్  మెదడులో ఉండే క్రేనియల్ నర్వ్ స్క్వానోమాస్  గ్లోమస్‌జ్యుగులేర్  ఆపరేషన్‌కు వీలుకాని  పారాగాంగ్లియోమాస్  హిమాంజియోమాస్  రక్తనాళాల అమరిక సరిగా లేని సందర్భాల్లో (వాస్కులార్ మాల్‌ఫార్మేషన్)  ఇటీవలే నమలడం సైతం కష్టమైనంతగా దవడ నొప్పితో సల్మాన్‌ఖాన్‌కు వచ్చిన ట్రైజెమినల్ న్యూరాల్జియా  క్లస్టర్ హెడేక్ వంటి సంక్లిష్టమైన తలనొప్పులు  తలలోని అత్యంత సంక్లిష్టమైన నరాలకు సర్జరీ చేయలేని సందర్భాల్లో సైబర్‌నైఫ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

  • Courtesy with : Dr.Mohana Vamsi (Oncologist -Hyd)@saakshi news paper 30/11/2014

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.