Tuesday, November 18, 2014

How many types of cancers present?, క్యాన్సర్లు ఎన్నిరకాలు గా ఉంటాయి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : క్యాన్సర్లు ఎన్నిరకాలు గా ఉంటాయి?

జ : మన శరీరములో ఏ భాగానికైనా రాగలిగే క్యాన్సర్లు దాదాపు వంద (100) రకాలకు పైగా ఉండడమే కాకుండా వాటిలో మళ్ళీ ఎన్నో సబ్ టైపులు కూడా ఉంటాయి. సాధారణము గా మన శరీరములో  కొత్త కణాలు ఏర్పడడము , పాతకణాలు అంతరించిపోవడము అనే ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఈ సమతుల్యత దెబ్బతిని కొత్తకణాలు అపరిమితము గా పెరిగిపోవడమే  క్యాన్సర్ . ఖచ్చితము గా కారణము ఇది అని తెలియకపోయినా ... స్మోకికంగ్ , దుర అలవాట్లు , కొన్ని రకాల వైరస్ లు , రసాయనాలు , రేడియేషన్‌  మున్నగునవి క్యాన్సర్ కణము పుట్టుకకు కారణము అయ్యే అంశాలని చెప్పవచ్చు . అందుకే కొన్ని వృత్తులలో ఉండే వారికి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదము ఎక్కువగా గమనిస్తూ ఉంటాము .

గడ్డలు ప్రధానముగా 2 రకాలు గా ఉంటాయి. 1. ప్రమాదము లేని గడ్డలు .. వేటినే " బినైన్‌ ట్యూమర్స్ " అని , 2.హానికర గడ్డలను ''మాలిగ్నెంట్ ట్యూమర్స్'' అని అంటారు. బినైన్‌('Benign) ట్యూమర్స్ ప్రాణాపాయము కానివి , ఇతర శరీర భాగాలకు , చుట్టుప్రక్కల కణజాలములోకి ప్రవేశించలేవు. చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా వీటిని పూర్తిగా తొలగించవచ్చు. . . కాని ప్రాణాపాయ ('malignant) గడ్డలు చుట్టుప్రక్కల కణజాలములోనికి , లింఫ్ ప్రవాహము ద్వారా ఇతర శరీరభాగాలకు వ్యాపించి అక్కడ కొత్త గడ్డలను ఏర్పరచుగలుగుతాయి.

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.