Monday, November 3, 2014

Hits to heart patients,హృద్రోగులకు జాగ్రత్తలు తెలియజేయండి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : హృద్రోగులకు జాగ్రత్తలు తెలియజేయండి?

జ : హృదయ స్పందన వేగం తగ్గితే...
1) రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు.
2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
3) నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే...
1) గుండె దడ వస్తుంది
2) సృహ తప్పడం జరుగుతుంది
3) తల తిరిగినట్లుగా అనిపిస్తుంది.

చికిత్స విధానం:

గుండె వేగం తగ్గినప్పుడు చాతి పెైభాగంలో చర్మం కింద ‘పేస్‌ మేకర్‌’ అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పరిగినప్పుడు బీటా బ్లాకర్స్‌ గుండె లయను క్రమబద్దీకరించే మందులు ఇస్తారు.
గుండె లయ తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
2) క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3) బరువు పెరగకుండా చూసుకోవాలి.
4) రక్త పోటును అదుపులో పెట్టుకోవాలి.
5) కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి.
6) సమతూ ఆహారం తీసుకోవాలి.
7) పొగ తాగటం మానివేయాలి.
8) జీవనశెైలిని, ఆదనపు అలవాట్లు మార్చుకోవాలి.

- డా శ్రీధర్‌ కస్తూరి-అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
  • *===========================

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.