Monday, November 3, 2014

Tell us Alcoholic bad effects,మద్యపానీయాలు ఆరోగ్య దుష్ర్పభావాలు తెలియజేయండి.

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

  •  
ప్ర : Tell us Alcoholic bad effects,మద్యపానీయాలు ఆరోగ్య దుష్ర్పభావాలు తెలియజేయండి.

జ : ఇటీవల కాలంలో పట్టణాలలోనే కాక, గ్రామాలలో కూడా మద్యపానం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో, వ్యవసాయధారులు తాగుడు వల్ల ఎన్నో అనర్థాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం ఎక్కువ అవడం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలతో పాటు, కుటుంబ ఆదాయం తగ్గి, సామాజిక సమస్యలతో బాధపడు తున్నారు.

మద్యపానీయులను (ఆల్కహాలు) చక్కెర ఉన్న ద్రవ పదార్థాలను పులియ బెట్టి తయారు చేస్తారు. ఈ మద్యపానీయాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి.బట్టీ పట్టిన మద్య పానీయాలలో మాల్టెడ్‌ మద్యాలు, వెైన్ల కన్నా ఆల్కహాల్‌ శాతం ఎక్కువగా ఉంటుంది.

  • మద్యపానీయాల వినియోగంలో సురక్షిత పరిమితులు:
ఎంత మద్యం తాగితే సురక్షితమో చెప్పడం చాలా కష్టం.
మద్యం వల్ల కాలేయ వ్యాధి వస్తుంది అన్న దాన్ని సూచనగా తీసుకున్నట్ల యితే కింద తెలిపిన మోతాదుకు మించి తాగ రాదు.
మగవాళ్లు : ఒక రోజుకు 190 మి.లీ. లేదా 1/4 సిసీ ఘాటు మద్యం.
ఆడవాళ్లు : రోజుకు 65 మి.లీ.
ప్రతిరోజు తాగే వారికి ఎప్పుడో సరదా కోసం తాగేవారి కంటే ఎక్కువ హాని కలుగుతుంది.
ఒక వారం రోజుల పైగా తాగే ఆల్కహాలును ఒకటి రెండు రోజుల్లోనే తాగి నట్లయితే గాయపడడానికి, ప్రమాదాల వల్ల చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

  • ఆహార పోషణలో మద్యం పాత్ర?
ఒక గ్రామం మద్యం ద్వారా 7.0 కాలరీల శక్తి లభిస్తుంది. కానీ ఈ కాలరీలు అంత మంచివి కాదు. ఎందుకంటే వీటిలో ఆహార పుష్టినిచ్చే గుణం లేదు. కేవలం శక్తిని మాత్రం ఇస్తాయి. పేదవారిలో, ముఖ్యంగా సాంఘీక, ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్న వారిలో మద్యపానం వలన లోప పోషణ ఎక్కువ కలుగుతుంది. మద్యపానం చేసే వారు ఆరోగ్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ ఆహారం తింటారు. దీనికి గల కారకాలు ఏమిటంటే...

    ఆహారం తక్కువగా తీసుకోవడమూ, ముఖ్యంగా అన్ని పోషకాలు గల సమతూల ఆహారాన్ని తీసుకోకపోవడము.

    జీర్ణకోశంలో మార్పు రావడం వలన గాని, సరిగా పని చేయకపోవడం, పోషక పదార్థాలు సరిగా గ్రహించుకో లేకపోవడం, లోప పోషణ వలన పేగులు పాడవడం జరుగుతుంది.
    కాలేయం మరియు ప్యాన్‌క్రియాస్‌ దెబ్బతినడం.
    శరీరంలో పోషకాల జీవక్రియ, నిల్వ ఉంచుకొనే శక్తి తగ్గటం.
    పోషక పదార్థాలు, ముఖ్యంగా బి విటమిన్ల అవసరం ఎక్కువ కావడం.
    మల మూత్రాల ద్వార ఎక్కువ పోషకాలు విసర్జితం కావడం.

  •     మద్యపానీయాలతో కలిగే అనార్యోగ్య పరిస్థితులు
    మద్యం సేవించడం వలన చాలా శరీర భాగాలకు, జీవకోశాలకు అనేక విధాల హాని కలుగుతుంది.

    జీర్ణకోశం వ్యాధులు:
    ఆల్కహాల్‌లో ఉండే హానికర గుణం వల్ల, అది సంక్రమించే లోప పోషణ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. పోషకాహారం దృష్ట్యా తగిన ఆహారం తీసుకుంటు న్నప్పటికీ, మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పెైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి. రక్తం కక్కుకుంటారు. స్పృ హ కూడ తప్పవచ్చు. వీరిని నొప్పి నుండి, మరణం నుండి కాపాడాలంటే సకాలంలో చికిత్స చేయించాలి. మద్యపానం మానిపించాలి. పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. మద్యపానం వల్ల పేగులు, పాన్‌క్రియాస్‌ కూడా బాగా దెబ్బ తింటాయి.

    గుండె జబ్బులు:    బి1 (థెైయమిను) లోపసం వల్ల గుండెలోని కండరాలకు హాని కలగడం చేత గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
    
రక్తహీనత:    మద్యపానీయాలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది.

    మెదడు నరాలు:    తాగుడు వల్ల మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. విటమిన్లు, ముఖ్యంగా ‘బి’ విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపై  చూపే చెడు ప్రభావం వల్ల ఇలా అవుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడు తుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం చేసే వ్యక్తి ఒకసారి ఇలాంటి లోపానికి గురయితే చికిత్స చేయడం కష్టమవుతుంది.

    లెైంగిక వాంఛ: పరుషుల్లో మద్యపానం వల్ల లెైంగిక వాంఛ తగ్గిపోతుంది. నపుంసత్వం ఏర్ప డుతుంది. ముఖం మీద వెంట్రుకలు తగ్గి ఆడంగి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలున్నపుడు తాగుడు మరింత పెరిగి, వారి పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. తాగుడు పూర్తిగా మానడమే దీనికి విరుగుడు.

    క్యాన్సర్‌ : ఆల్కహాలిసమ్‌ వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబం ధం ఉంది.తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది. వారు పనికి తరచు గెైరు హాజరవుతారు. అనారోగ్యానికి గురవుతారు. ఈ కారణాల వల్ల ఉత్పత్తి పడిపోతుంది. తాగుడు నిరుద్యోగానికి దారి తీస్తుంది. అకాల మరణం కూడా సంభవించవచ్చు. మద్యపానం అలవాటుగా మారకముందే దాని వల్ల కలిగే ముప్పును గ్రహించాలి. లేని పక్షంలో రకరకాల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

  •     - డా కె. ఉమామహేశ్వరి--    ప్రొఫెసర్‌ (ఆహారం పోషణ)--    ప్రధాన శాస్తవ్రేత్త--    గుణ నియంత్రణ పరిశోధనాలయం--    ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం--    రాజేంద్ర నగర్‌, హైదరాబాద్‌


  • *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.