Saturday, November 15, 2014

Irregular monthly periods,నెలసరి చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : మా అమ్మాయి వయసు 14 ఏళ్ళు , నెలసరి చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని నెలలుగా రాదు . నెలసరి వచ్చినప్పుడు  రక్తస్రావము కూడా 8-10 రోజులు ఉంటుంది ..ఎందువల్ల ? ఏం చేయాలి ?

జ : రజస్వల అయ్యాక ఋతుక్రమము సక్రమముగా రావడానికి కొంత సమయము పడుతుంది. అయితే క్రమము లేని నెలసరి  సరిగ్గా మేనేజ్ చెయ్యడానికి కొన్ని సాధారణ చర్యలు తీసుకోవాలి.
  • ఆరోగ్యవంతమైన ఆహారాన్ని వేళప్రకారము తింటుండాలి. 
  • చిరుతిండ్లు , ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. 
  • ఐరన్‌ , విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉండాలి ,
  • వ్యాయామము తప్పనిసరిగా చేస్తుండాలి.వ్యాయామము , రిలాక్షేషన్‌ టెక్నిక్స్ ద్వారా వత్తిడి తగ్గిందుకోవాలి.
  • చాలాసార్లు ఋతుక్రమము సరిగా లేకపోవడానికి స్థూలకాయము కారణం అవుతుంది. జాగ్రత్తపడాలి.

  • *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.