Saturday, November 1, 2014

Cautions of Food taking in Winter,శీతాకాలములో భోజన పదార్ధాల విషములో జాగ్రత్తలేమైనా తీసుకోవాలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



 ప్ర : శీతాకాలములో భోజన పదార్ధాల విషములో జాగ్రత్తలేమైనా తీసుకోవాలా?

జ : శీతాకాలములో పగలు తక్కువగా ఉండడము , చలి ఎక్కువగా ఉండడము వలన జీర్ణ శక్తిలో కొంత తగ్గుదల ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు , మితముగా ఆహారము తీసుకోవాలి.ఈ క్రింది నియమాలు పాటిస్తే మేలు కలుగుతుంది.
  • ఉప్పు , వగరు , ఆమ్లగుణము కలిగిన ఆహారపదార్ధాలు అతిగా తినవద్దు , వీటివలన అజీర్ణము , కడుపు ఉబ్బరము , గాస్ సమస్య వంటివి ఏర్పడతాయి. 
  • అతిగా వేయించిన కూరలు , మాంసాహారం వంటివి తక్కువగా తీసుకోవడము  లేదా అసలు దూరము గా ఉండడము మంచిది. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళవద్దు .
  • ఆకుకూరలు బాగా కడిగి శుభ్రం చేయాలి .  పచ్చి కూరలు తినడం శీతాకాలము లో మంచిది కాదు .పండ్లు , కాయకూరలు పూర్తి శుభ్రము గా కడకకుండా వాదవద్దు .
  • శుచి , శుభ్రత కలిగిన ప్రదేశాలలో ఉండే ఆహారము తీసుకుంటే మంచిది . 
  • మిగిలి పోయిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లో దాచిపెట్టి  మరుచటి రోజూ తినవద్దు . 
  • అతి చల్లని నీరు త్రాగవద్దు . ఐస్ క్రీమ్‌ లు వంటివి అతిగా తీసుకోవడము మంచిది కాదు .
  • సులభము గా జీర్ణము అయ్యే కాయకూరలు చక్కగా ఉడికించి తినడము మంచిది. 
  • వంటకాలకు మంచి నూనె , కొబ్బరినూనె , ఆలివ్ నూనె వంటివి వాడడం మంచిది. 
  • వీలున్నంత వరకు పాత బియ్యం వాడడము మంచిది. 


  • *===========================

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.