Saturday, November 15, 2014

Do breast cancer effect in young age?,బ్రెస్ట్ క్యాన్స్ ర్ చిన్న వయసులోనూ రావచ్చా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  


 ప్ర : బ్రెస్ట్ క్యాన్స్ ర్  చిన్న వయసులోనూ రావచ్చా? సాధారనము గా బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసు వారికి వస్తుంది?

జ : వయసూ , ఎత్తు , బరువు , పేద , ధనిక  ఏ విషయమూ క్యాన్సర్ కు ఎదురు (అడ్డు) కాదు . ప్రపంచ వ్యాప్తముగా పతి 8 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ కు గురి అవుతున్నారు. మనదేశములో ప్రతి 22 మంది స్త్రీలలో ఒకరు రొమ్ము క్యాన్సర్ కు గురి అవుతున్నారు. అయితే చిన్న వయసులో ఈ వ్యాధి వచ్చే అవకాశము తక్కువ .
పట్టణ మహిళలో ,
  • అధిక బరువు ఉండే వారిలో , 
  • వయసు పై బడిన స్త్రీలలో , లేటు వయస్సులో పిల్లలు కన్నవారిలోనూ, 
  • పిల్లలకి పాలివ్వని తల్లులలోనూ , 
  • రజస్వల త్వరగా అయిన వారిలో , 
  • మెనొపాజ్ కు 55 ఏళ్ళు పై బడినా చేరుకోని వారిలో, 
  • దీర్ఘ కాలికముగా హార్మోను ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో ,
..........ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఎక్కువ .

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.