Tuesday, November 4, 2014

Difference ovulation pain and rupturecsyst pain ఒవులేషన్‌ నొప్పికి.రప్చర్ సిస్ట్ నొప్పికి నడుమ తేడా ఉంటుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
-



 ప్ర : ఒవులేషన్‌ నొప్పికి, రప్చర్ సిస్ట్  నొప్పికి నడుమ తేడా ఉంటుందా? వివరించగలరు?

జ : నొప్పి అనేది కొద్దిపాప్టి తేడా తప్ప అన్నివేళలా ఒకేలా ఉండును. ఓవులేషన్‌ ఋతుక్రమము మధ్యలో జరుగుతుంది. కొద్దిగా నొప్పి కొంచం సేవు ఉంటుంది. రప్చర్ సిస్ట్ వల్ల నొప్పి ఋతుక్రమము సైకిల్ లో ఎప్పుడైనా రావచ్చు. సిస్ట్ స్వభావము బట్టి నొప్పి తీవ్రత ఉంటుంది. సింపుల్ సిస్ట్ అయితే అందోళన పడనవసరము లేదు. రప్చర్ చాక్లెట్ సిస్ట్  లేదా రప్చర్ ఫిజియోలాజికల్ లూటిల్ సిస్ట్ (చాలా అరుదు)అయితే తీవ్రమైన నొప్పితో పాటు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొన్ని సార్లు రప్చర్ లూటీల్ సుస్ట్ ను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గా పొరపడే అవకాశముంది. మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తే మంచిది.
  • *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.