Tuesday, December 9, 2014

Sleep disturbences in Pregnency ?,గర్భిణి లలో తరచు రాత్రులలో మెలకువ వచ్చేస్తుందెందుకు ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : నేను 7 వ నెల గర్భవతిని. రాత్రివేళ చాలా సార్లు మెలుకువ వచ్చేస్తుంటుంది . బరువు మోయలేనట్లు గాను , అలసటగాను ఉంటుంది. ఏమి చేయాలి ? 

జ : అవకాశము , వీలుకలిగినప్పుడల్ల ఎంతోకొంత విశ్రాంతి తీసుకోండి . రాత్రి భోజనము చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించవద్దు. 5 నిముషాలు నడవాలి. ఒకవేళ రాత్రిల్లు తక్కువ నిద్ర పోయినప్పటికీ అందోళన చెందవద్దు . . ఊరికే అలా కళ్ళుమూసుకొని పడుకొని శరీరానికి అవసరమైన స్థాయిలో రెస్ట్ తీసుకుంటూ ఉండాలి.

బి.ప్. , సుగరు వ్యాధులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవాలి. కాలు వాపులు (పొంగులు) ఉండకూడదు. మూతములో ఆల్బుమిన్‌ పోతుందేమో తనికీ చేయిందుకోవాలి. రక్తహీనత ఉందేమో హీమోగ్లోబిన్‌ తనికీ చేయిందుకోవాలి. వీటిలో ఏది ఉన్నా మీకు ఆయాసము , బరువుగా ఉన్నట్లు అనిపించును.  మంది డాక్తర్ ని సంప్రదించి తగిన మందులు వాడాలి. గుర్రపు వాతము ('elcampsia ) రాకుండా జాగ్రత్త పడాలి.

  •  *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.