ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : మనిషి ఆయుర్ధాయము పెంచే హార్మోన్ ఉంటుందా?
- జ : మనిషి ఆయుర్ధాయము పెంచే హార్మోన్ మానవ శరీములో నే తయారవుతుంది. మానవ శరీరము లో ఉన్న వినాళగ్రంధులలో ఎడ్రినల్ గ్రంధి ఒకటి .. మూత్రపిండం మీద టోపీలాగా కూర్చుని కనిపించే ఈఅ గ్రంధి స్రవించే అనేక హార్మోనులలో డి.హెచ్.ఇ.ఎస్.( ACTH-dependent. hormone,. DHEA,. also. known. as. DHES-sulfate.) అనే హార్మోన్ జీవితం ఆయుర్ధాయం ను పెంచుతుంది. అయితే ఈ హార్మోన్ స్రవించడము అందరిలో ఒకేలా ఉండదు .
- ఎవరైతే సంపూర్ణ పోషకపదార్ధాలను తీసుకుంటారో ,
- ఎవరైతే క్రమము తప్పకుండా వ్యాయామను చేస్తారో ,
- ఎవరికైతే ఇష్టపడి చేసే వ్యాపకాలు ఉంటాయో,
- ఎవరిలో అయితే మానవ సంబంధాలు మెరుగా ఉంటాయో ,
........... వారిలో మాత్రమే ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ హార్మోన్ ఉత్పత్తికి మానసిక స్థితికి ఎంతో దగ్గర సంబంధము ఉంది. సక్రమైన మానసిక స్థాయి, ఒత్తిడులకు గురికాని వారి ఆయుర్ధాయాన్ని పెంచుతుంది.
- *===========================
visit my website - >
Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.