Thursday, December 18, 2014

పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



 ప్ర : పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

జ : ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము . పిల్లలు ఈ విధమౌగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి.
  • ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు 
  • అలవాటు గానో కావచ్చు , 
  • ఎవరినైఅనా అనుకరిస్తూనో చేయవచ్చు ,
  • ఖాళీ గా  ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూ వచ్చు.
చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్నా ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి . ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి.  పరీక్షల భయము , స్నేహితుల ఒత్తిడి , కుటుంబసబ్యులలో లేదా స్కూల్లో తోటి పిల్లలతో తగాదాలు వంటివి కారనమైతే ... ఆ దిశగా పిల్లల యాంగ్జైటీని తగ్గించే ప్రయత్నాలు చెయ్యాలి.  ఓ అలవాటుగా చేస్తుంటే ఇదెంతటి దురలవాటో , దీనివల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో, పిల్లల పట్ల  ఎదుటివారి అభిప్రాయము ఏవిధముగా ప్రభావితము అవుతుందో వారికి వివరించాలి .బలవంతము గానో , పనిష్మెంట్ల భయం తోనో కాక అవగాహనతో మానిపించే దిశగా ప్రయత్నించాలి. పనిష్మిమెంట్లు ఇవ్వడము వల్ల పిల్లలు గోళ్లు కొరకడాన్ని మానకపోగా ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాగే వేళ్ళకు చేదు రాయడము వంటివి చేయకూడదు ఇతరత్రా పనులలో వారిని ఎంగేజ్ చెయ్యడము వల్ల వారికి గోళ్ళు కొరుక్కోవాలన్న తలంపు రాదు .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.