Thursday, December 11, 2014

foods to eat for controle weight gain?,బరువు పెరగ కుండా ఆహారపదార్ధాలు ఏవిధము గా తినాలి ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


 ప్ర : బరువు పెరగ కుండా మంచి ఆరోగ్యము కోసము ఆహారపదార్ధాలు ఏవిధము గా తినాలి ?.

జ : కొద్దికొద్దిగా తినండి . ముఖ్యము గా ఆరోగ్యకరం కాని వాటి విషయము లో ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. చీజీ , పిజ్జాల వంటి వాటిని పూర్తిగా ఆహారము నూడి తీసెయ్యాలి . కొద్ది గా ఎప్పుడైనా తినవచ్చు. పూర్తిష్థాయి  ధాన్యాలు , గింజలు , పప్పులు వంటి కాంప్లెక్స్ కార్భోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోవచ్చు.

పండ్లు , కూరగాయలు  ఎక్కువగా తినాలి. చెక్కెర పదార్ధాలు , రిఫైండ్ ఉత్పత్తులు పరిమితముగా తినాలి. రోజుకి సుమారు 2 లీటర్ల నీటిని తాగాలి. ప్రతిరోజూ 30 నుండి 60 నిముషాలు పాటు వ్యాయామము చేయాలి. ఇలా ఆరోగ్యవంతము కాని పదార్ధాలు తక్కువగా తింటూ, ఆరోగ్యవంతమైనవి అధికమౌగా తింటూ చురుకైన జీవన విధానము అనుసరించినంత కాలము బరువు పెరగరు.

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.