Tuesday, December 9, 2014

Do we not use vitamin tablets?,విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము
  •  

  •  

ప్ర : మా ఫామిలీ డాక్టర్ మల్టీవిటమిన్‌ మాత్రలు ఎక్కువగా వాడకూడదని అన్నారు. మనము విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదా?

జ : విటమిన్‌ మాత్రలు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాటి లేమి శరీరము నకు  అనేక రోగాలకు  తట్టుకునే శక్తి ఉండదు. అయితే వైద్యులు చెప్పకుండా విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదు. విటమిన్లు శరీరానికి అవసరమే కాని వాటిని మితముగా అవసరమున్నంతవరకే వాడాలి. విటమిన్ల లో నీటిలో కరిగేవి , నూనెలో కరిగేవి అని రండురకాలు . .   'A,'D,'E అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అతిగా వేసుకుంటే శరీరానికి ఇబ్బందులు తప్పవు . ఇవి ఎక్కువగా తింటే కాలేయములో నిలువచేయబడి శరీరము మీద వ్యతిరేక ప్రభావము చూపుతాయి.
  • జుట్టు రాలిపోవడము,
  • ఆకలి మందగించడము ,
  • ఎకుకల నొప్పులు , 
  • కొన్ని సమయాలలో లివర్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశము , ఉంటుంది.
నీటిలో కరిగే విటమిన్లు ఎక్కువగా వాడినా  ... అవి మూత్రము ద్వారా విసర్జించబడి నందున సైడు ఎఫెక్ట్ (వ్యతిరేక ప్రబావము) ఉండదు . వీటిని అంటే 'B,'C, విటమిన్లను  వాడుకోవచ్చును.

అందువలన మల్టీవిటమిలు ఎలాబడితే అలా  వేసుకోవద్దు . మంచిది కాదు.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.