Monday, August 29, 2011

నెఫ్రోటీక్‌ సిండ్రోం , Nephrotic Syndrome



Q : మా బాబు వయసు 8 సంవత్సరాలు. ఆరేళ్ల వయసులో ముఖం, కాళ్ల వాపులొచ్చాయి. మూత్రంలో ప్రోటీన్‌పోతోంది. నెఫ్రోటిక్‌ సిండ్రోం అని చెప్పి చికిత్స చేశారు. నెల రోజులు మందులు వాడిన తర్వాత ప్రోటీన్‌ పోవడం తగ్గింది. మందులు కూడా మానేశాం. 15 రోజుల తర్వాత మూత్రంలో ప్రోటీన్‌ వెళ్లడం మొదలైంది. మళ్లీ 15 రోజులు మందులు వాడిన తర్వాత ప్రోటీన్‌ పోవడం తగ్గింది. ఇలా మందులు వాడిన తర్వాత తగ్గుతుంది. మందులు మానగానే మళ్లీ యురిన్‌లో ప్రోటీన్‌ పోతుంది. ఇలా ఎక్కువ కాలం మందులు వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశముందా? దీని వల్ల భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందా?

శంకర్‌రెడ్డి, కదిరి.

A : నెఫ్రోటీక్‌ సిండ్రోం ఉన్నప్పుడు మొదటిసారిగా పూర్తిగా మూడు నెలలపాటు డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంత మంది పిల్లల్లో మందులు మానగానే మళ్లీ ప్రోటీన్‌ పోవడం మొదలవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులు 6 నుంచి 9 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. కొంత మందిలో మందుల వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశముంది. దుష్ఫలితాలు వచ్చినప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలా మంది పిల్లల్లో ఈ వ్యాధి 12 నుండి 14 సంవత్సరాల వయసులో పూర్తిగా నయం అవుతుంది. భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ.

--డాక్టర్‌ శ్రీధర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌అవేర్‌గ్లోబల్‌హాస్పిటల్‌,హైదరాబాద్‌.
  • ======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.