Wednesday, August 24, 2011

Fits , మూర్చ



ప్ర : నాకు 15 ఏళ్ల నుంచి ఫిట్స్‌ వస్తున్నాయి. మందులు వాడినా తగ్గలేదు. మెదడు సిటి-స్కాన్‌ చేశారు. నార్మల్‌ అని తేలింది. డాక్టర్‌ సూచన ప్రకారం మూడేళ్లు మందులు వాడాను. ఇదే కాక ఆయూర్వేదం, హోమియో మందుల కూడా వాడినా ప్రయోజనం కనిపించలేదు. ఫిట్స్‌ వస్తూనే ఉన్నాయి. ఈ మందులు వాడటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గింది. కొన్ని విషయాలు గుర్తుండడం లేదు. మందులు సరిగా పనిచేయలేదని అనుమానం కలిగింది. ఫిట్స్‌ రావడంతో స్వీట్లు తినడం మానేశాను. ఫిట్స్‌ ఎందుకొస్తాయి? దీనికి ప్రత్యేక చికిత్స ఉందా? మందులతో తగ్గుతుందా?



జ : మెదడులో కరెంట్‌ ఎక్కువ అవడం వల్ల ఫిట్స్‌ వస్తుంటాయి. మెదడులో గడ్డ ఏర్పడడం, మెదడుకు దెబ్బతగలడం వల్ల కూడా కరెంట్‌ పెరుగుతుంది. ఇది ఫిట్స్‌ రూపంలో బయటపడుతుంది. దీన్ని ఇడోపతిక్‌ ఎపిలెప్సీ (అంటే ఏ కారణం లేకుండా వస్తుందని అర్థం) అంటారు. దీన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా స్కానింగ్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌, ఇఇజి పరీక్షలు చేయించాలి. వీటి రిపోర్టుల ఆధారంగా మందులు వాడితే తొంబై శాతం వరకు ఫిట్స్‌ను పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. వందలో ఐదు శాతం మందికి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యాధునికమైన మందులు, శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర్లోని న్యూరోసర్జన్‌ను కలవండి.

Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.