Wednesday, August 24, 2011

Back ach after siting longtime,ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల నడుము నొప్పి

ప్ర : నా వయస్సు 50 సంవత్సరాలు. టేబుల్‌ వద్ద కూర్చునే ఉద్యోగం చేస్తున్నాను. రెండేళ్ల నుంచి విపరీతమైన నడుం నొప్పితో బాధపడుతున్నాను. ఎంతో మంది ఆర్థోపిడీషియన్లు, న్యూరాలజిస్టులను కలిశాను. ఎంఆర్‌ఐ కూడా చేయించుకున్నాను. అందరూ విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందని సలహా ఇచ్చారు. పెయిన్‌ కిల్లర్స్‌ వాడాలని చెప్పారు. కాని శాశ్వతంగా తగ్గే మార్గం చెప్పలేదు. అప్పుడప్పుడు మెడనొప్పి కూడా వస్తోంది. కాళ్లు తిమ్మిరెక్కడం, మొద్దుబారడం, విపరీతమైన నొప్పులతో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం, ఒక పక్క పడుకోలేకపోవడం వంటి సమస్యలున్నాయి. ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నా. నా సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుపగలరు.



జ : ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల నడుం నొప్పి, మెడనొప్పి రావడం సాధారణం. ఎంఆర్‌ఐ రిపోర్టును బట్టి చికిత్స చేయవచ్చు. కానీ మీరు ఎంఆర్‌ఐ రిపోర్టులో ఏం రాశారో తెలుపలేదు. నడుం నొప్పికి ప్రధాన కారణం సరిగా కూర్చోకపోవడమే. కూర్చునే విధానం తెలియాలి. గంటల కొద్దీ కూర్చోకుండా గంటకోసారి రిలాక్స్‌ కావాలి. డెస్కు పనిచేసేవాళ్లు నడుం ఎక్సర్‌సైజులు రెగ్యులర్‌గా చేయాలి. సరిగా కూర్చోవడం, నడవడం, నిల్చోవడం, బరువులెత్తడం అలవాటు చేసుకుంటే 90 శాతం నడుం నొప్పిని దూరంగా ఉంచవచ్చు. మీకు డిస్క్‌ జారడం వల్ల నడుం నొప్పి వచ్చిందని అనుమానం. దీని వల్లే కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. మీరు దగ్గర్లోని స్పైన్‌ లేదా ఆర్థోపెడిక్‌ సర్జన్‌ను కలవండి.

Source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
  • ===========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.