Thursday, August 25, 2011

ఒక చోట కుదురుగా ఉండదు,can not stay at one place





ప్ర : మా పాప వయసు ఏడేళ్లు. క్లాసులో ఒక చోట కుదుటగా ఉండదు. తరచూ అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఎంతసే పైనా చదువుతుంది. కాని రాయడమే సమస్యగా మారింది. మిగతా అన్ని విషయాల్లో తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఏమిటీ సమస్య? చికిత్స ఉందా? తెలపగలరు.



జ : ఇలాంటి సమస్యను అటెన్షన్‌ డెఫిసిట్‌ డిసార్డర్‌ (ఎడిహెచ్‌డి) అంటారు. వీరికి తెలివితేటల్లో సమస్య ఉండదు. ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టిసారించలేరు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది విశ్లేషించాలి. సమస్య నుండి బయటపడడానికి కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. కంటిన్యుగా చదివించకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వాలి. ఒక సారి చదివిన తర్వాత దాన్ని రెండుసార్లు రాయించాలి. వీరు ఏడ్చి బయటికి వెళ్లి చదువు నుంచి తప్పించుకుంటారు. అందుకని కాస్త కఠినంగా ఉండాలి. వీరు పొగడ్తలకు బాగా రెక్టిఫై అవుతారు.

source : రక్ష డెస్క్ Mon, 15 Aug 2011.
=============================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.