Wednesday, August 24, 2011

ఎపెండమోమా గ్రేడ్‌-2,Ependimoma-2




ప్ర : మా బాబు వయసు 16 సంవత్సరాలు. పది నెలల క్రితం తలనొప్పి వచ్చింది. కంటి డాక్టర్‌కు చూపించాం. మందులు వాడితే తగ్గింది. పది నెల తరువాత మళ్లీ వచ్చింది. రెండు సార్లు మెదడు ఆపరేషన్‌ చేశారు. ఎపెండమోమా గ్రేడ్‌-2 అని చెప్పారు. ఆరు వారాలు రేడియేషన్‌ చేయించాను. రేడియేషన్‌ వల్ల రోజు రోజుక బలహానంగా తయారవుతున్నాడు. సరిగా నడవడం రావడం లేదు. తూలుతూ నడుస్తున్నాడు. అన్నం కూడా తక్కువ తింటున్నాడు. డాక్టర్లు మాత్రం ఏం చెప్పడం లేదు. ఎపెండమోమా గ్రేడ్‌-2 అనేది జబ్బు పేరా? దీనికి ఎపిడమిక్‌ బ్రేయిన్‌ అటాక్‌కు సంబంధం ఉందా? చికిత్స ఉందా? సలహా ఇవ్వగలరు.



జ : పెండమోమా గ్రేడ్‌-2 అంటే లోగ్రేడ్‌ క్యాన్సర్‌. దీని చికిత్సలో రేడియేషన్‌, కీమోథెరపీ పద్ధతులను ఉపయోగిస్తారు. కరెంట్‌ ప్రసారం చేసినప్పుడు మెదడులో వాపు వల్ల రియాక్షన్‌ జరుగుతుంది. దీని వల్ల నీరసం, బలహీనంగా అవ్వడం, తలతిరగడం వంటివి జరుగుతాయి. ఇలా కొన్ని నెలల తరువాత సాధారణ పరిస్థితి నెలకొంటుంది. డాక్టర్‌ సలహా ప్రకారం ఆహారం తీసుకోవాలి.

  • ====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.