Thursday, August 25, 2011

కళ్ల కింద చారలు కట్టడి ఎలా?,Black color under eyes-prevention

Q : నా వయసు ముప్ఫైనాలుగు. కళ్లకింద చారలు వచ్చేశాయి. దాంతో వయసులో మరీ పెద్దదానిలా కనిపిస్తున్నాను. వాటిని తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయంటారా?

A : కళ్లకింద నల్లటి చారలు రావడానికి నిద్రలేమి, అదేపనిగా టీవీ కంప్యూటరు ముందు కూర్చోవడం.. అధిక ఒత్తిడి, ఎప్పుడూ దిగులుగా ఉండటం.. ముఖ్యంగా ఆహారంలో ఇనుము పోషకం లోపించడం... వంశ పారంపర్యము ...వంటివి ప్రధాన కారణాలు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్నీ గమనించుకోండి. ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. అలాగే బంగాళాదుంప తురుమును కళ్లపై పెట్టుకుని ఐదునిమిషాలయ్యాక తీసేయాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేసి చూడండి. కాచిన పాలను ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయ్యాక దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని పదినిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

రోజుమార్చి రోజు కాచిన పాల మీగడతోగాని.. విటమిన్‌ ఈ క్రీంతోగానీ రెండు నిమిషాలు మర్దన చేసి పదినిమిషాలయ్యాక కడిగేయండి. కళ్లు మిలమిలలాడతాయి. వీటివల్ల ఎంతో మార్పు ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో.. రోజూ నాలుగు నుంచి ఆరు ఖర్జూరాలు, పది ఎండుద్రాక్ష, ఒక టమాటా తప్పనిసరిగా ఉండాలి. వారానికి ఐదురోజులు ఆకుకూరలు తినండి. అది కుదరనప్పుడు ప్రతిరోజూ ఒకటిన్నర చెంచా వీట్‌గ్రాస్‌ పొడిని తీసుకోండి. మాంసాహారులైతే... వారానికోసారి కాలేయం కూరను తినండి. ఎంతో మార్పు ఉంటుంది.


for more details - click here -- black color under eyes
  • ==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.