Thursday, December 1, 2011

Trigeminal Neuralgia,ట్రైజెమినల్ న్యూరాల్జియా

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  •  ప్ర: నా వయస్సు 45. ఫైనాన్షియల్ జాబ్ చేస్తున్నాను. ఒక ఏడాదిగా ముఖం కుడి భాగం లాగుతోంది. నొప్పిగా కూడా ఉంటోంది. రాత్రివేళ ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల నమలడం కష్టంగా ఉంది. పంటినొప్పితో ఈ సమస్య మొదలవుతుంది. డాక్టర్‌ను కలిస్తే ఒక పంటిని తీసేశారు. అయినా ఈ సమస్య ఇలా ముఖంలో సగభామంతా పాకింది. న్యూరోఫిజిషయన్‌ను సంప్రదిస్తే కొన్ని మాత్రలు రాశారు. వాటివల్ల నొప్పి కొంత తగ్గినా ఆ భాగంలో తిమ్మిరిగా ఉంటోంది. అయితే ఈ మాత్రలను ఎక్కువకాలం వాడటం మంచిది కాదు అంటున్నారు. నా సమస్యకు విముక్తి కలిగే మార్గం చెప్పండి.

  • జ: మీకున్న సమస్యకు ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటారు. ఈ వ్యాధి రావడానికి గల కారణమేమిటో ఇప్పటి వరకు తెలియదు. అయినా ఈ వ్యాధిని నయం చేసే మందులు ఉన్నాయి. మెజీరియం-200 మందును వారానికి ఒక రోజు చొప్పున నాలుగు వారాలపాటు వేసుకోండి. అవసరమైతే మరో మారు ఈ మందులు వేసుకోండి. ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. యోగా, ప్రాణాయామం చేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.
  • ================================================= 
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.